కోలీవుడ్ హీరో ధనుష్‌పై తమిళ చిత్రపరిశ్రమ ప్రయోగించిన రెడ్‌కార్డ్‌ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో నడిగర్ సంఘం చర్చలు జరిపి ధనష్‌తో ఉన్న వివాదాన్ని పరిష్కరించింది. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్‌కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్‌కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ధనుష్‌పై రెడ్‌కార్డ్ జారీ అయింది.
ధనుష్‌పై తమిళ నిర్మాత మండలి రెడ్ కార్డ్ ప్రయోగించిన వెంటనే నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తప్పుబట్టారు. నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీకి చాలా నష్టమని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ధనుష్ వల్ల ఇబ్బుందులు పడుతున్నామని ఆరోపించిన త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ అధినేతలతో చర్చలు జరిపారు. దీంతో గతంలో వారి నుంచి తీసుకున్న డబ్బు ధనుష్ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పడంతో లైన్ క్లియర్ అయింది.
ఇదే విషయం గురించి ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. 'నా నిర్మాతలు,త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నాకు అండగా నిలిచిన నడిఘర్ సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకుని నిజాయితీగా సమస్యను పరిష్కరించారు. దీంతో మేము కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను వెంటనే తిరిగి ప్రారంభించకలిగాము. నాజర్, కార్తీ,విశాల్, కరుణాస్‌లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్యలను పరిష్కరించి మాకు సహాయపడటమే కాకుండా పరిశ్రమకు మంచి ఉదాహరణగా నిలిచారు.' అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment