మెగాఫోన్ పట్టనున్న అరవింద్‌స్వామి
తెరపై రెండు రకాలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక తెర వెనుక తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నారు.ఆయనే నటుడు అరవింద్‌స్వామి. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన భారీ చిత్రం దళపతి ద్వారా పరిచయమైన నటుడీయన. అందులో యువ కథానాయకడిగా కలెక్టర్ పాత్రలో అరవింద్‌స్వామి ఆ తరువాత కారణాలేమైనా సినిమాకు దూరం అయ్యారు.అదీ చిన్న గ్యాప్‌నే. తనను హీరోగా పరిచయం చేసిన అదే మణిరత్నం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కడల్ చిత్రం అరవింద్‌స్వామి ఇటీవల తనీఒరవన్ చిత్రంలో జయంరవికి విలన్‌గా మారి మరో కోణంలో తనను ది బెస్ట్‌గా ఆవిష్కరించుకున్నారు. అలాంటి మల్టీ టాలెంటెడ్ నటుడిని అరవింద్‌స్వామి తలుపు తట్టడం మొదలెట్టాయి.
అయితే పాత్రల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్న ఈ క్రేజీ నటుడు తను తొలిసారిగా విలన్‌గా ఢీకొన్న జయంరవితోనే మరో సారి భోగన్ చిత్రంలో విలనీయం ప్రదర్శించనున్నారు. ఇంతకు ముందు జయంరవితో రోమియో జూలియట్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణన్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో,విలన్,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన అరవింద్‌స్వామి తాజాగా దర్శకుడిగా తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. త్వరలోనే తమిళం తేదా? హిందీలో గానీ ఒక చిత్రానికి మోగాఫోన్ పట్టాడానికి సిద్ధం అవుతునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యో అవకాశం ఉంది.