megaphone
-
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్!
చెట్టు పొదల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే పాత్రలు కాకుండా వాటికి పూర్తి భిన్నంగా ఉండే పాత్రలు చేసే కథానాయికలు అరుదుగా ఉంటారు. చెప్పాలంటే... ఈ తరహా నాయికలు వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది కూడా ఉండరు. అందుకే అలాంటి పాత్రలు చేసే తారలు ఎప్పటికీ గుర్తుండిపోతారు. నందితా దాస్ అలాంటి నాయికే. ‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందిత. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా భేష్ అనిపించుకున్నారామె. ఆర్ట్ తరహా చిత్రాల పైనే నందిత ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. చివరికి తాను దర్శకురాలిగా మారి, తీసిన తొలి చిత్రం ‘ఫిరాక్’ కూడా ఆ కోవలోనే ఉంటుంది. 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండ ఆధారంగా నందిత తీసిన ఈ చిత్రం దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 2008లో ఆమె ఈ చిత్రం తీశారు. ఆ తర్వాత మళ్లీ డెరైక్షన్ జోలికి వెళ్ల లేదు. ఈ ఏడాది మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించ నున్నారు. 1912లో జన్మించిన మంటో 1955లో చనిపోయారు. నందిత దర్శకత్వం వహించిన ‘ఫిరాక్’ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చు కున్న నవాజుద్దీన్ సిద్ధిఖి టైటిల్ రోల్ చేయనున్నారు. ‘‘మంటోలాంటి చాలెంజింగ్ రోల్ నవాజుద్దీనే చేయగలుగుతారు’’ అని నందిత పేర్కొ న్నారు. గత మూడేళ్లుగా ఆమె కథను వర్కవుట్ చేస్తున్నారు. మంటో కుటుంబ సభ్యులను కలిసి, ఆమె కొంత సమాచారం సేకరించారు. -
మెగాఫోన్ పట్టనున్న అరవింద్‌స్వామి
తెరపై రెండు రకాలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక తెర వెనుక తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నారు.ఆయనే నటుడు అరవింద్‌స్వామి. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన భారీ చిత్రం దళపతి ద్వారా పరిచయమైన నటుడీయన. అందులో యువ కథానాయకడిగా కలెక్టర్ పాత్రలో అరవింద్‌స్వామి ఆ తరువాత కారణాలేమైనా సినిమాకు దూరం అయ్యారు.అదీ చిన్న గ్యాప్‌నే. తనను హీరోగా పరిచయం చేసిన అదే మణిరత్నం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కడల్ చిత్రం అరవింద్‌స్వామి ఇటీవల తనీఒరవన్ చిత్రంలో జయంరవికి విలన్‌గా మారి మరో కోణంలో తనను ది బెస్ట్‌గా ఆవిష్కరించుకున్నారు. అలాంటి మల్టీ టాలెంటెడ్ నటుడిని అరవింద్‌స్వామి తలుపు తట్టడం మొదలెట్టాయి. అయితే పాత్రల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్న ఈ క్రేజీ నటుడు తను తొలిసారిగా విలన్‌గా ఢీకొన్న జయంరవితోనే మరో సారి భోగన్ చిత్రంలో విలనీయం ప్రదర్శించనున్నారు. ఇంతకు ముందు జయంరవితో రోమియో జూలియట్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణన్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో,విలన్,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన అరవింద్‌స్వామి తాజాగా దర్శకుడిగా తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. త్వరలోనే తమిళం తేదా? హిందీలో గానీ ఒక చిత్రానికి మోగాఫోన్ పట్టాడానికి సిద్ధం అవుతునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యో అవకాశం ఉంది. -
అందుకే మెగాఫోన్ పడుతున్నా!
మంచి చిత్రాలు రావాలి అందుకే అంటున్న నటి నిత్యామీనన్ చెప్పదలచుకుందేమిటో చూద్దాం. ఈ కేరళ కుట్టి మాతృభాషతో పాటు తమిళం, తెలుగు చిత్రాలు చేస్తూ బహుభాషా నటిగా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో నూట్రియంబదు, వెప్పం, మాలిని 22 పాళైమం కోట్టై, జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాల్లో నటించినా, బాగా పాచుర్యం పొందింది మాత్రం మణిరత్నం ఓ కాదల్ కణ్మణి, రాఘవ లారెన్స్ కాంచన-2 చిత్రాలతోనే అని చెప్పవచ్చు.ప్రస్తుతం సూర్య సరసన 24 చిత్రంలో నటిస్తున్న నిత్యామీనన్ త్వరలో మెగాఫోన్ పట్టనున్నానని అంటున్నారు. దీని గురించి ఆమె చెబుతూ కథలు రాయడంపై తనకు ఆసక్తి ఎక్కువ అన్నారు. విరామ సమయాల్లో కథలు రాస్తుంటానని తెలిపారు. ఆ కథలను చిత్రాలుగా రూపొందించాలనుకుంటున్నానన్నారు. షూటింగ్ సమయాల్లో సన్నివేశాలను ఎలా చిత్రీకరించాలన్నది నేర్చుకున్నానన్నారు. ఒక్కోసారి దర్శకులు అడిగితే చేర్పులు,మార్పుల విషయాల్లో సూచనలు అందించేదాన్నని తెలిపారు. తనకాపరిజ్ఞానం ఉందని చెప్పారు.ప్రస్తుతం హీరోయిన్గా బిజీగా ఉన్నాననీ, తన మార్కెట్ తగ్గిందని పించినప్పుడు మెగాఫోన్ పడతానని వివరించారు. మంచి చిత్రాలు రావాలని అందుకే తాను దర్శకురాలినవుతున్నానని పేర్కొన్నారు. ఇకపోతే తాను పొట్టిగా ఉన్నానని చాలా మంది కొరత చూపడం వల్ల తనకు ఎలాంటి చింతా లేదని అన్నారు.హీరోలతో క్లోజ్ సన్నిహితంగా నటించేటప్పుడు స్టూల్‌ను ఉపయోగిస్తారని చెప్పారు. దుల్కర్సల్మాన్, నితిన్, సందీప్మీనన్ లాంటి హీరోల సరసన నటించానని వాళ్లంతా పొడుగైన వారేనని అన్నారు.తను పొట్టిగా ఉండడం వల్ల హీరోలు తనకు బాగా సహకరిస్తున్నారని అన్నారు. ఇది సంతోషంతో పాటు గర్వంగాను ఉందని నటి నిత్యామీనన్ అన్నారు. -
మళ్లీ మెగాఫోన్ పట్టుకున్న ముక్తాశ్రీనివాసన్
కార్యదక్షుడికి మనసుతోనే గానీ వయసుతో పని ఉండదని మరోసారి నిరూపిస్తున్నారు ప్రఖ్యాత దర్శక నిర్మాత ముక్తా శ్రీనివాసన్. ఆయన వయసు ఎంత అన్నది అప్రస్తుతం ఎందుకంటే సినీ అనుభవమే 70 వసంతాలు. ఆ అనుభవంతో ప్రఖ్యాత నటులు శివాజీగణేశన్, జెమినీగణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి ఈ తరం నటుల వరకూ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందిన ఘనత ముక్తా శ్రీనివాసన్‌ది. ఆయన దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాలలో మచ్చుకు చెప్పాలంటే ముదలాలి, నాలు వెలి నీలం, తామరైకుళం,ఓడి విళైయాడు పాపా, శ్రీరామజయం, నినైవిల్ నిండ్రవన్, అండమాన్ కాదలీ, సిమ్లా స్పెషల్ చిత్రాలు చెప్పవచ్చు. ఈయన నిర్మించిన నాయగన్ చిత్రం కమలహాసన్ సినీ జీవతంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల సినీ అనుభవం గల ముక్తా శ్రీనివాసన్ 25 ఏళ్ల గ్యాప్ తరువాత మెగాఫోన్ పట్టి సంఘ సంస్కర్త ఆధ్యాత్మక ప్రబోధకుడు శ్రీరామానుజర్ జీవిత చరిత్రను మనిదనేయర్ రామానుజర్ పేరుతో వెండి తెరకెక్కించడానికి నడుం బిగించారు.ఈ చిత్ర వివరాలను ఆయన వెల్లడిస్తూ మనుష్యులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పాటుపడిన మహానుభావుడు శ్రీరామానుజర్ అని అన్నారు. బ్రాహ్మణులకే ఆలయ ప్రవేశం అన్న కుల జాఢ్యం నుంచి ప్రజలను బయట పడేసిన తొలి ప్రబోధకుడు రామానుజర్ అని తెలిపారు. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను తెరకెక్కించడం తనకు ఘనతేనన్నారు. చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి మూడు నెలలో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.చిత్ర షూలింగ్ను శ్రీపెరంబత్తూర్,కల్యాణపురం,కోవిలడి,తిరుకోవిళూర్, శ్రీరంగం ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.ఇది తనకు 45 వ చిత్రం అని ముక్తా శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
మెగాఫోన్ పడతా
మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా తారలు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అవకాశాలను రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఇక టెక్నిక్‌గా భావించవచ్చు.నటి ప్రియమణి ఇందుకు అతీతం కాదు. తమిళం,తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి పేరుగాంచిన నటి ప్రియమణి. అయితే ఈ అమ్మడికి షడన్‌గా ఏ భాషలోనూ అవకాశాలు లేకపోవడం గమనార్హం. దీంతో చిత్ర పరిశ్రమలో సంచలనం కలిగించే విధంగా తనకొక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనీ, ముంబైకి చెందిన అతని పేరు ముస్తాఫా రాజ్ అనీ, వచ్చే ఏడాది తాము పెళ్లి చేసుకోనున్నట్టు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది ప్రచారానికి బాగానే ఉన్నా అమెకు అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో ప్రియమణి తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేమిటంటే మెగాఫోన్ పట్టనున్నానని. ప్రియమణికి నటనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. నటిస్తున్నప్పుడు విరామసమయాల్లో ఒక పక్కన కూర్చోకుండా దర్శకుడి పని తీరును, చాయాగ్రాహకుడి ట్రిక్స్‌ను ఒక కంట కనిపెట్టేవారట. ఇంకేముంది ఇప్పుడామెకి దర్శకత్వం చేయాలన్న ఆశ విశ్వరూపం ఎత్తిందట. ఇది సాధ్యమో కాదో కానీ నాన్ఈ చిత్రం ఫేమ్ సుధీప్ కథానాయకుడిగా ఒక చక్కని ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని కోరికగ్గా ఉందని నటి ప్రియమణి అన్నారు. ఇది నిజంగా జరిగే పనేనా?లేక దీన్ని తన ప్రచారానికి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అన్నది వేచి చూడాల్సిందే. -
ఆ ఐదుగురితో డెరైక్షన్ చేస్తానంటున్న సోనమ్!
పులి కడుపున పులే పుడుతుంది. అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ అదే నిరూపించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారామె. అయితే ఆమె దానితోనే సంతృప్తిపడదలచుకోలేదు. మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. ఇంతకీ సోనమ్ ఎప్పుడు డెరైక్టర్ అవుతారు? కథలు రెడీ చేసుకున్నారా? డెరైక్టర్ అయ్యాక ఏయే కథానాయికలతో సినిమాలు తీయాలనుకుంటున్నారు?.. ఆ విషయాలు తెలుసుకుందాం... * కథానాయికగా అడుగుపెట్టే ముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర సోనమ్ కపూర్ దర్శకత్వ శాఖలో చేశారు. మూడేళ్ల పాటు ఆయన దగ్గర డెరైక్షన్ నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అంతకు ముందు సింగపూర్‌లో యునెటైడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియాలో థియేటర్లో అండ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ డెరైక్షన్, రైటింగ్ నేర్చుకున్నారు. * సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్లాక్’ చిత్రానికి సోనమ్ దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే భన్సాలీ తన తదుపరి చిత్రం ‘సావరియా’లో హీరోయిన్గా నటించమని సోనమ్‌ని అడిగారు. అప్పుడు ఈ బ్యూటీ దాదాపు 80 కిలోల బరువు ఉండేవారు. ‘సావరియా’లో నటించడం కోసం 35 కిలోలు తగ్గారు. మొదటి చిత్రంతోనే తన అందచందాలు, అభినయంతో అందర్నీ ఆకట్టుకుని, క్రేజీ హీరోయిన్ అయిపోయారు సోనమ్. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. * కథానాయికగా బిజీ అయినప్పటికీ డెరైక్షన్ చేయాలనే తన లక్ష్యాన్ని సోనమ్ మర్చిపోలేదు. వీలు కుదిరినప్పుడల్లా రకరకాల కాన్సెప్టులు అనుకుంటున్నారు. కొన్ని కథలు కూడా రాసుకున్నారు. రొమాంటిక్ మూవీస్ అంటే సోనమ్‌కు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు, కామెడీ మూవీస్‌ని తెరకెక్కించాలనుకుంటున్నారామె. మరో ఐదు, పదేళ్లల్లో మెగాఫోన్ పట్టుకోవాలనుకుంటున్నారు. * ఓ దర్శకురాలిగా ఏయే కథానాయికలతో సినిమాలు చేయాలో కూడా సోనమ్ ఓ జాబితా రాసుకున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, పరిణీతి చోప్రా, ఆలియా భట్, స్వర భాస్కర్ ఉన్నారు. ఈ ఐదుగురూ చాలా టాలెంటెడ్ అనీ, ఎలాంటి పాత్రలో అయినా నటింపజేయవచ్చని సోనమ్ అంటున్నారు. ‘‘వీళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన మిగతా కథానాయికలు వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అందరూ ప్రతిభావంతులే. అందుకని మిగతావాళ్లతో కూడా సినిమాలు చేస్తా’’ అంటున్నారు సోనమ్. మొత్తం మీద సోనమ్ చెబుతున్న మాటలు చూస్తుంటే డెరైక్షన్ని ఆమె సీరియస్‌గానే తీసుకున్నారని అనిపిస్తోంది. హిందీలో మీరా నాయర్, దీపా మెహతా, ఫరా ఖాన్, నందితా దాస్ వంటి లేడీ డెరైక్టర్స్ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ల జాబితాలో సోనమ్ చేరతారు. అయితే, వాళ్లందరూ వేరు. సోనమ్ వేరు. కమర్షియల్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకున్న కేటగిరీలో ఉన్న తార సోనమ్. సో.. సోనమ్ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయి? నటిగా పేరు తెచ్చుకున్న సోనమ్ దర్శకురాలిగా కూడా భేష్ అనిపించుకుంటారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
చిరు 150వ సినిమా దర్శకుడెవరు ?
-
మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?
-
చిరంజీవే దర్శకత్వం వహిస్తారా?
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మెగాఫోన్ పట్టుకుంటారా? అవునట ఆయన దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలిన ఆయన తాజాగా దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. రీల్ మీద పాలిటిక్స్‌ను ఈజీగా హ్యాండిల్ చేసిన చిరంజీవి రియల్ లైఫ్ రాజకీయాల్లో మాత్రం తడబడిన విషయం తెలిసిందే. పాలిటిక్స్ ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకునేందుకు మెగాస్టార్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల నుంచి కాస్త విశ్రాంతి దొరకటంతో చిరంజీవి సినిమాలపై.. అందునా తన 150వ సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా తన స్వీయదర్శకత్వంలో ఆ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాగా చిరంజీవి 150 సినిమాకి డైరెక్టర్‌గా చాలామంది పేర్లు తెర మీదకు వచ్చాయి. ఛాన్స్ ఇస్తే చిరు సినిమాకు దర్శకత్వం వహిస్తానని దర్శకుడు వీవీ వినాయక్ బాహాటంగానే చెప్పాడు. కానీ చిరంజీవి మాత్రం స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారట. నలభై ఏళ్ల తన నటనా అనుభవంతో ఆయన మెగాఫోన్ పట్టుకునేందుకు డిసైడ్ అయ్యారట. తాను నటించి దర్శకత్వం వహిస్తే భారీ క్రేజ్ వస్తుందని కూడా చిరు భావిస్తున్నారట. కాగా చిరంజీవి దర్శకత్వంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.