
మెగాఫోన్ పడతా
మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా తారలు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అవకాశాలను రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఇక టెక్నిక్‌గా భావించవచ్చు.నటి ప్రియమణి ఇందుకు అతీతం కాదు. తమిళం,తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి పేరుగాంచిన నటి ప్రియమణి. అయితే ఈ అమ్మడికి షడన్‌గా ఏ భాషలోనూ అవకాశాలు లేకపోవడం గమనార్హం. దీంతో చిత్ర పరిశ్రమలో సంచలనం కలిగించే విధంగా తనకొక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనీ, ముంబైకి చెందిన అతని పేరు ముస్తాఫా రాజ్ అనీ, వచ్చే ఏడాది తాము పెళ్లి చేసుకోనున్నట్టు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇది ప్రచారానికి బాగానే ఉన్నా అమెకు అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో ప్రియమణి తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేమిటంటే మెగాఫోన్ పట్టనున్నానని. ప్రియమణికి నటనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. నటిస్తున్నప్పుడు విరామసమయాల్లో ఒక పక్కన కూర్చోకుండా దర్శకుడి పని తీరును, చాయాగ్రాహకుడి ట్రిక్స్‌ను ఒక కంట కనిపెట్టేవారట.
ఇంకేముంది ఇప్పుడామెకి దర్శకత్వం చేయాలన్న ఆశ విశ్వరూపం ఎత్తిందట. ఇది సాధ్యమో కాదో కానీ నాన్‌ఈ చిత్రం ఫేమ్ సుధీప్ కథానాయకుడిగా ఒక చక్కని ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని కోరికగ్గా ఉందని నటి ప్రియమణి అన్నారు. ఇది నిజంగా జరిగే పనేనా?లేక దీన్ని తన ప్రచారానికి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అన్నది వేచి చూడాల్సిందే.