
అందుకే మెగాఫోన్ పడుతున్నా!
మంచి చిత్రాలు రావాలి అందుకే అంటున్న నటి నిత్యామీనన్ చెప్పదలచుకుందేమిటో చూద్దాం. ఈ కేరళ కుట్టి మాతృభాషతో పాటు తమిళం, తెలుగు చిత్రాలు చేస్తూ బహుభాషా నటిగా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో నూట్రియంబదు, వెప్పం, మాలిని 22 పాళైమం కోట్టై, జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాల్లో నటించినా, బాగా పాచుర్యం పొందింది మాత్రం మణిరత్నం ఓ కాదల్ కణ్మణి, రాఘవ లారెన్స్ కాంచన-2 చిత్రాలతోనే అని చెప్పవచ్చు.ప్రస్తుతం సూర్య సరసన 24 చిత్రంలో నటిస్తున్న నిత్యామీనన్ త్వరలో మెగాఫోన్ పట్టనున్నానని అంటున్నారు. దీని గురించి ఆమె చెబుతూ కథలు రాయడంపై తనకు ఆసక్తి ఎక్కువ అన్నారు.
విరామ సమయాల్లో కథలు రాస్తుంటానని తెలిపారు. ఆ కథలను చిత్రాలుగా రూపొందించాలనుకుంటున్నానన్నారు. షూటింగ్ సమయాల్లో సన్నివేశాలను ఎలా చిత్రీకరించాలన్నది నేర్చుకున్నానన్నారు. ఒక్కోసారి దర్శకులు అడిగితే చేర్పులు,మార్పుల విషయాల్లో సూచనలు అందించేదాన్నని తెలిపారు. తనకాపరిజ్ఞానం ఉందని చెప్పారు.ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్నాననీ, తన మార్కెట్ తగ్గిందని పించినప్పుడు మెగాఫోన్ పడతానని వివరించారు. మంచి చిత్రాలు రావాలని అందుకే తాను దర్శకురాలినవుతున్నానని పేర్కొన్నారు.
ఇకపోతే తాను పొట్టిగా ఉన్నానని చాలా మంది కొరత చూపడం వల్ల తనకు ఎలాంటి చింతా లేదని అన్నారు.హీరోలతో క్లోజ్ సన్నిహితంగా నటించేటప్పుడు స్టూల్‌ను ఉపయోగిస్తారని చెప్పారు. దుల్కర్‌సల్మాన్, నితిన్, సందీప్‌మీనన్ లాంటి హీరోల సరసన నటించానని వాళ్లంతా పొడుగైన వారేనని అన్నారు.తను పొట్టిగా ఉండడం వల్ల హీరోలు తనకు బాగా సహకరిస్తున్నారని అన్నారు. ఇది సంతోషంతో పాటు గర్వంగాను ఉందని నటి నిత్యామీనన్ అన్నారు.