మళ్లీ సింగిల్‌ లెటర్‌తో ఉపేంద్ర సినిమా.. ఏడేళ్ల తర్వాత | Upendra Returns To Direction With Single Letter Movie U | Sakshi
Sakshi News home page

Upendra New Movie: సింగిల్‌ లెటర్‌తో ఉపేంద్ర సినిమా.. ఏడేళ్ల తర్వాత

Published Sat, Mar 12 2022 9:07 AM | Last Updated on Sat, Mar 12 2022 9:09 AM

Upendra Returns To Direction With Single Letter Movie U - Sakshi

Upendra Returns To Direction With Single Letter Movie U: ఉపేంద్ర విలక్షణ నటుడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఓంకారం, ఎ, ఉపేంద్ర’ తదితర చిత్రాల ద్వారా దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్నారు. అయితే ‘ఉప్పి 2’ (2015) తర్వాత మళ్లీ ఉపేంద్ర మెగాఫోన్‌ పట్టలేదు. ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత తాజాగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సింగిల్‌ లెటర్‌ టైటిల్‌ను పెట్టారు. ఒక అక్షరంతో సినిమా తీయడం ఉపేంద్రకు బాగా అలవాటు. ఇదివరకూ ఎ, రా చిత్రాలు కన్నడతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. ఒక సినిమాకు అయితే టైటిలే లేకుండా కేవలం సింబల్‌ను వాడి సూపర్‌ అనే మరో మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు 'యూ' అనే భిన్నమైన టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం (మార్చి 11) విడుదల చేశారు. కన్నడంలో ‘టగరు’, ‘సలగ’ వంటి సినిమాలను నిర్మించిన వీనస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలసి లహరి మ్యూజిక్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘భారీ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ ప్యాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉపేంద్ర ‘ఎ’ చిత్రం నుంచి ఆయనతో మాకు మంచి అసోసియేషన్‌ ఉంది’’ అన్నారు లహరి మ్యూజిక్‌ గ్రూప్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి. మనోహరన్‌. ‘‘దేశవ్యాప్తంగా ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుంది’’ అన్నారు వీనస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ శ్రీకాంత్‌. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement