Director Balaji Mohan Click Shankar Movie Announced By Junglee Pictures Deets Here - Sakshi
Sakshi News home page

Click Shankar Movie: హై సస్పెన్స్​ థ్రిల్లర్​గా 'క్లిక్ శంకర్​'..

Published Tue, May 3 2022 1:51 PM | Last Updated on Tue, May 3 2022 2:40 PM

Balaji Mohan Click Shankar Movie Announced By Junglee Pictures - Sakshi

Balaji Mohan Click Shankar Movie Announced By Junglee Pictures: కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్, చందమామ కాజల్​ అగర్వాల్​ కలిసి నటించిన చిత్రం మారి. పావురాల నేపథ్యంలో సాగిన ఈ మూవీ మంచి హిట్​ అందుకుంది. తర్వాత ఈ సినిమాకు సీక్వెల్​గా మారి 2 కూడా తెరకెక్కించారు డైరెక్టర్​ బాలాజీ మోహన్. ఇందులో సాయ పల్లవి హీరోయిన్​గా నటించింది. అయితే తాజాగా మారి చిత్రాల దర్శకుడు బాలాజీ మోహన్​ మరో విభిన్న కథాంశంతో ఓ థ్రిల్లర్​ మూవీని పట్టాలెక్కించనున్నారు. 

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ జంగ్లీ పిక్చర్స్​ ప్రకటించింది. హైపర్ థైమీసియా అనే వ్యాధితో బాధపడే శంకర్ రెబేరో అనే పోలీసు కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీకి 'క్లిక్​ శంకర్' అని టైటిల్​ పెట్టారు. హైపర్​ థైమిసీయా ఉన్న వ్యక్తికి ప్రతి సంఘటన గుర్తు ఉంటుంది. ఇది ఒక్కోసారి బలమైతే, మరోసారి బలహీనత అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసు పాత్ర జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు, మలుపులతో హై సస్పెన్స్​ థ్రిల్లర్​గా మూవీ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. 

చదవండి: అప్పుడు నా గుండె ముక్కలైపోయింది: పూజా హెగ్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement