మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాపై రోజుకో ట్విస్ట్..
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ...ఎవరి దర్శకత్వం అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాఫిక్గా మారింది. చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాకు దర్శకుడు మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ రీఎంట్రీ సినిమా కథలో ట్విస్టులెలా ఉంటాయో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ గురించి రోజుకో ట్విస్ట్ రివీలవుతుంది.
పూరి జగన్నాథ్ చెప్పిన కథలో మార్పులు చేయాడానికి రచయిత చిన్నికృష్ణను చిరంజీవి రంగంలోకి దింపినట్లు సమాచారం. అయితే చిన్నికృష్ణది ముక్కుసూటి మనస్తత్వం , పూరీకి మోహమాటం ఎక్కువ కావటంతో వీళ్ళద్దరి మధ్య సఖ్యత కుదరదనేది ఇండస్ట్రీ వాదన. ఏది ఎలా ఉన్నా చిరు 150 సినిమా మాత్రం రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ చిత్రానికి వేరే దర్శకుణ్ణి తీసుకున్నారనే చర్చకు పూరి జగన్నాథ్ ఒక్క ట్వీట్‌తో పుల్‌స్టాప్ పెట్టేశారు . 'చిరంజీవిగారికి ఈ చిత్రానికి సంబంధించిన కథ తాలూకు ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వర్క్ చేయాలి. ఇది పది రెట్లు బాగుండేలా తయారు చేస్తా' అని పూరి కొద్దిరోజుల క్రితం ట్విట్ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు కొద్దిరోజుల క్రితం చిరంజీవి దర్శకుడు వినాయక్తో నాలుగు గంటల సుదీర్ఘ చర్చల తరువాత చిరంజీవి ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అందుకే ఇప్పుడు చిన్నికృష్ణ పేరు వినిపిస్తోంది. అయితే చిన్నికృష్ణ 'ఆటోజానీ' కథకు తుది మెరుగులు దిద్దుతాడా లేదంటే మరో కొత్త కథను తయారు చేస్తాడా అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాటల్ని బట్టి వినాయక్ ఆధ్యర్వంలో చిన్నికృష్ణ చిరంజీవి కోసం ఓ పవర్‌ఫుల్ కథ సిద్ధం చేసాడని తెలుస్తోంది. మరి దాన్ని వినాయక్ డైరెక్ట్ చేస్తాడా లేక పూరీ తెరకెక్కిస్తాడా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు చిరంజీవి అభిమాన సంఘాలు కూడా ఈనెల మొదటి వారంలో హైదరాబాద్లో (అప్పటి పీఆర్పీ కార్యాలయం) సమావేశం అయ్యారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా (ఆగస్టు 22) ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరి 150వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే..