ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతున్న సినీనటుడు అర్జున్
సాక్షి, తిరుమల:‘ నా కూతురు ఐశర్వ హీరోయిన్‌గా న టించే›ప్రేమరాత చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నా’ అని ప్రముఖ హీరో అర్జున్ అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేమరాత చిత్రంలో హీరోగా చందన్ అనే కొత్త నటుడిని పరిచయం చేస్తున్నానని వెల్లడించారు. ఆగస్టు 15 తేదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఏటా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఈసారి షూటింగ్ కారణంగా రాలేకపోయానన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. అనంతరం జాపాలి ఆంజనేయ స్వామివారిని, ధర్మగిరి ప్రాంతంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని అర్జున్ దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే భక్తులతో కలసి అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలసి ఆనందంగా గడిపారు.