సమంత 'దృష్టి' పడింది..! | Super happy to tell you all that @Samanthaprabhu2 will release the title and first look posters of my next film tomorrow | Sakshi
Sakshi News home page

సమంత 'దృష్టి' పడింది..!

Published Thu, Sep 7 2017 10:19 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

సమంత 'దృష్టి' పడింది..!

సమంత 'దృష్టి' పడింది..!

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖనటుడు, సింగర్‌  చిన్మయి భర్త,  రాహుల్‌ రవీంద్రన్‌  దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా సినిమా ప్రారంభించబోతున్న రాహుల్ హీరోగానూ కొనసాగుతున్నాడు. రాహుల్ లీడ్ రోల్ లో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ సమంత ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది.

మరోవైపు  సమంత అద్భుత నటనకు, చిన‍్మయి  డబ్బింగ్‌ పూవుకు తావిలా  వుంటుందనేది జగమెరిగిన సత్యం.  అందుకే  రాహుల్‌కు  కొత్త ప్రాజెక్టుకు  ఆమె ఇంత సపోర్ట్‌ చేస్తున్నారనీ,  తన గొంతుతో  ఎనలేని కీర్తిని, గుర్తింపును తెచ్చిపెట్టిన చిన్మయి  శ్రీప్రాదకు కృతజ్ఞతగానే సమంత దీనికి ఒప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే  ట్విట్టర్‌ వేదికగా   ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా తీయ‌బోతున్నాన‌ని రాహుల్ ర‌వీంద్ర‌న్  ప్రకటించారు.  తన చిన్ననాటి కల నెరవేరబోతోందని.. ఈ సినిమాకు  హీరో సుశాంత్ అని కూడా క్లారిటీ ఇచ్చారు.  సిరుని సీనా కార్పొరేషన్‌ ప్రొడ్యూస్ చేయబోతోందని,  అక్టోబర్‌ చివర్లోకానీ, నవంబరులో కాని షూటింగ్‌ మొదలుపెట్టనున్నట్టు  రాహుల్‌ వెల్లడించారు. అలాగే ఈ కొత్త ప్రాజెక్ట్‌లో వెన్నెల కిషోర్‌, విద్యారామన్‌ ను కూడా  అలరించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement