Actress Samantha Team Up With Rahul Ravindran For New Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha: ఆ హీరో డైరెక్షన్‌లో నటించేందుకు సామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

Published Fri, Nov 18 2022 12:22 PM | Last Updated on Fri, Nov 18 2022 1:03 PM

Samantha And Rahul Ravindran Collaborate For a Movie - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం యశోద మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. బక్సాఫీసు వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. సరోగసి నేఫథ్యంలో వచ్చిన ఈసినిమాలో తన నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌లో అలరించింది. దీంతో ఆమె తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. నెక్ట్‌ సమంత ఎవరి డైరెక్షన్లో చేయనుంది, ఎవరికి ఒకే చెప్పనుందనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమె ఓ నటుడు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

చదవండి: సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్‌ బాబు కీలక నిర్ణయం!



స్టార్‌ హీరోయిన్‌ సమంత నటుడు డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ సమంతకు ఓ స్టోరీ లైన్‌ వినిపిండాడట. అది ఆమెకు బాగా నచ్చిందని, దీంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్‌. అయితే మొదట రాహుల్‌ ఈ కథను రష్మికకు వినిపించాడట, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత సమంత కోసం ఈ స్క్రీప్ట్‌ మర్పులు చేసి ఆమెకు స్టోరీ చెప్పగా సమంత ఒకే చేసినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమకథా రూపొందుతున్న ఈచిత్రంలో సామ్‌ విజయ్‌తో జతకట్టింది. 

చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement