
Prabhu Deva Sensational Decision: ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా..నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా తొలి చిత్రంతోనే హిట్ కొట్టారు. ఆ తర్వాత రూపొందించిన పౌర్ణమి సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే పోకిరి సినిమాను రీమేక్ చేసి హిందీ, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి : ఆ సమస్యతో బాధపడుతున్న హీరోయిన్ తమన్నా
అయితే ఆ తర్వాత మాత్రం డైరెక్టర్‌గా ఆశించినంత స్థాయిలో ప్రభుదేవా కెరీర్ లేదని చెప్పుకోవచ్చు. ఇటీవలె సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కించిన రాధే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో ఇకపై డైరెకక్షన్‌కు గుడ్‌బై చెప్పాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారట.
అంతేకాకుండా నటుడిగా వరుస అవకాశాలు వస్తుండటంతో దానిపైనే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో మెయిన్ లీడ్‌లో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment