ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వూల్ఫ్. వినూ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమాగా తెరకెక్కుతోందీ చిత్రం. గురువారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
వూల్ఫ్ టీజర్ చూస్తుంటే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవాలు సరికొత్త లుక్‌లో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి. అనసూయ గెటప్ అయితే తాంత్రికురాలిలా అనిపిస్తోంది. ఆమె లుక్ జనాలను భయపెట్టేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు కీలక పాత్రల్లో నటించారు. అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
చదవండి: గతేడాది ప్రియుడితో పెళ్లి, అంతలోనే నటికి పుట్టెడు శోకం
Comments
Please login to add a commentAdd a comment