హీరోహీరోయిన్ కావొచ్చు.. హీరో-కమెడియన్ కావొచ్చు.. కొన్ని కాంబోలు సూపర్ హిట్ అవుతుంటాయి. అలా 'ప్రేమికుడు'(కాదలన్)లో ప్రభుదేవా, వడివేలుల కాంబో కేక పుట్టించింది. దీని తర్వాత 'మనదై తిరుడి విట్టాయ్'లోనూ కలిసి నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ జోడీ సెట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ కాంబో తిరిగి ఓ మూవీలో కనిపించనుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
వరుత్త పడాద వాలిభర్ సంఘం, రజనీ మురుగన్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు పొన్‌రామ్ కొత్తగా ఓ చిత్రం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. దీనికి 'లైఫ్ ఈజ్ బ్యూటిపుల్' అనే టైటిల్ నిర్ణయించారని టాక్. ఇందులోనే ప్రభుదేవా-వడివేలు కలిసి నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రభుదేవా దళపతి విజయ్ 'ద గోట్' మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. వడివేలు.. మరోసారి ఫహాద్ ఫాజిల్‌తో కలిసి నటిస్తున్నాడు.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment