
తమిళసినిమా: నటి రాధికా ఆప్టే గురించి పరిచయం అక్కర్లేదు. అందాల ఆరబోతలో ఈ అమ్మడిని మించిన వారు ఉండరేమో. తమిళంలో ధోని చిత్రంతో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు తదితర భాషల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీ అయ్యారు.
అయితే తాను నటించిన కథానాయకులపైనే విమర్శలు చేస్తూ వివాదాస్పద నటి అనే ముద్ర వేసుకుంది. అలాంటి ఈ నటి దృష్టి ఇప్పుడు దర్శకత్వంపై పడింది. ఇప్పటి వరకు ఇతరుల డైరక్షన్‌లో నటించిన ఈ బ్యూటీ త్వరలో హీరోలని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. దీని గురించి ఒక భేటీలో రాధికా ఆప్టే మాట్లాడుతూ దర్శకురాలు కావాలనే మొదట భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా హీరోయిన్ అయ్యానని తెలిపింది.
తాను దర్శకత్వం శాఖలో శిక్షణ పొందినట్లు చెప్పింది. అది నటనకు ఉపయోగపడిందని పేర్కొంది. అయితే ఇప్పుడు మెగా ఫోన్ పట్టాలని నిశ్చయించుకున్నట్లు చెప్పింది. అయితే స్క్రీన్‌ప్లే రూపొందించడంలో తగిన శిక్షణ పొందాలని, అందుకు ప్రముఖ దర్శకుల వద్ద పని చేయ్యాలనుకుంటున్నట్లు చెప్పింది. అదే సమయంలో కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పింది. అలాగని నటనకు స్వస్తి చెబుతున్నానని భావించరాదని, తన తొలి ప్రాధాన్యత నటనకేనని పేర్కొంది. అయితే ఈ అమ్మడు ఏ భాషలో దర్శకత్వం వహించేది మాత్రం చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment