దర్శకత్వమే లక్ష్యం
దర్శకత్వమే లక్ష్యం అంటుంది నటుడు, దర్శకుడు పార్తిపన్ వారసురాలు కీర్తన. ఈమె మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రం ద్వారా బాల నటిగా పరిచయమయ్యూరు. ఆ తరువాత ఈమె హీరోయిన్‌గా తెరంగేట్రం ఖాయం అని చాలా మంది భావించారు. అయితే కీర్తన నటనపై ఆసక్తి కనబరచడంలేదు. ప్రస్తుతం కీర్తన తండ్రి పార్తిపన్ కదై తిరైకథై వచనం ఇయక్కం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తన సహ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించకుండా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. అయితే తన లక్ష్యం మాత్రం మెగా ఫోన్ పట్టడమేనంటోంది.
అరణ్య కాండం చూసినప్పటి నుంచి ఆ చిత్ర దర్శకుడు త్యాగరాజ కుమార్ రాజా వద్ద శిష్యరికం చేయాలనే కోరిక కలిగిందట. ఈ విషయాన్ని తన తండ్రి పార్తిపన్‌కు విన్నవించుకోగా ఆయన వెంటనే త్యాగరాజా కుమార్‌రాజాతో మాట్లాడి ఆయన వద్ద సహాయ దర్శకురాలిగా చేర్చారట. అయితే హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసే ఆలోచన లేదా అంటే క్రియేటివ్ దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటానంటోంది కీర్తన. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు సరైన సమయం రాగానే బాధ్యతలను చేపడతానని కీర్తన అంటోంది.