చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా | Megastar Chiranjeevi’s 150th film director is yet to be confirmed | Sakshi
Sakshi News home page

చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా

Published Wed, Oct 1 2014 9:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా

చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా

విశాఖ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు. అందుకు సరైన కథ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వినాయక్ అక్కడ విలేకర్లతో మాట్లాడాడు.

మహేష్ బాబు హీరోగా వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మరో ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీసే యోచన ఉందన్నాడు. జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్ 2 కూడా తీయనున్నట్లు చెప్పాడు.  భూ విక్రయానికి సంబంధించిన పని మీద వినాయక్ రావటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అతడిని చూసేందుకు, కలిసి ఫోటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement