v.v.vinayak
-
ఖైదీ నంబర్ 150 రూ.102 కోట్ల వసూళ్లతో రికార్డు
కాకినాడ రూరల్ : ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. కాకినాడ లో మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో నాలుగు రోజులకు రూ.102 కోట్ల వసూలు చేసి చరిత్ర సృష్టించినట్లు వినాయక్ వివరించారు. ఏ చలన చిత్రం కూడా తక్కువ రోజుల్లో భారీగా కలెక్షన్లు వసూలు చేయలేదన్నారు. మొదటి రోజు మాదిరిగానే ఇప్పటికీ కలెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ చిత్రం విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తామని, అది ఎక్కడ ఏర్పాటు చేసేదీ త్వరలోనే వెల్ల డించనున్నట్లు తెలిపారు. సొంత కథతో ‘చిరు’ హీరోగా సినిమా పిఠాపురం టౌ¯ŒS (పిఠాపురం) : తన సొంత కథతో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వి.వి. వినాయక్ వెల్ల డించారు. మంగళవారం పిఠాపురం వచ్చిన ఆయనకు అభిమాను లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దర్శకత్వం వహించిన ఖైదీ నంబర్ 150 సినిమా ప్రదర్శిస్తున్న స్థానిక సత్యా థియేటర్లో కొంతసేపు విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నంబర్ 150 సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందన్నారు. మెగాస్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని వినాయక్ అన్నారు. సుమారు 2500 థియేటర్లలో ఈ సినిమా విడుదలై, వారం తిరగకుండానే రూ.125 కోట్లకు పైగా వసూలు చేసిందన్నారు. థియేటర్ యాజమాని దేవరపల్లి చినబాబు, పట్టణ మెగా అభిమానుల సంఘం సభ్యులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - వి.వి.వినాయక్
-
వి.వి వినాయక్ డైరెక్షన్లో మహేష్ బాబు ?
-
సందీప్ కిషన్ సరసన సమంత?
-
'చిరు' ప్రయత్నాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తిరిగి కెమెరా ముందుకు రావడానికి రె'ఢీ' అవుతున్నారు. అందుకోసం ఆయన తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. త్వరలో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక150వ చిత్రం కోసం చిరంజీవి ప్రత్యేకించి 'స్పా' థెరపీ చేయించుకునేందుకు ఏకంగా కేరళ వెళ్లినట్టు సమాచారం. తమ అభిమాన నటుడి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక రకంగా తీపి కబురే. ఎందుకంటే.. ఆయన కెమెరాకు దూరమై దాదాపు ఐదేళ్లు దాటిపోయింది. 2009లో విడుదలైన 'మగధీర' తర్వాత చిరంజీవి కెమెరా ముందుకు రాలేదు. భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం చిరంజీవి స్లిమ్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన అత్యంత సన్నిహితుడు తెలిపారు. చిరు స్టెప్స్ అంటే ఇప్పటి యూత్‌కు కూడా ఎంతో క్రేజ్. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి తన ఆహార్యం మీద అంతగా శ్రద్ధ తీసుకోకపోవటంతో ఆయన బరువు పెరిగారు. దాంతో అదనాన్ని తగ్గించుకునేందుకు 'చిరు' ప్రయత్నం చేస్తున్నారట. ఈజీగా మూమెంట్స్ ఇవ్వాలంటే స్లిమ్ అవ్వాలనుకున్నారట. ఇప్పటికే రోజూ వ్యాయామం చేసి కాస్తంత బరువు కూడా తగ్గారట ఈ హీరో. చిరుతో పాటు పరుచూరి బ్రదర్స్‌లో ఒకరు కేరళకు వెళ్లినట్లు సమాచారం. చిత్ర కథకు సంబంధించి అక్కడ కూడా చర్చలు జరుపుతున్నారట. సరైన కథ దొరకక ఇన్ని రోజులూ చిరంజీవి వేచి ఉన్నారని.. ..ప్రస్తుతం కథ సిద్ధమైనట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చేయబోయే ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు కూడా సిద్ధం చేశారు. వీరి కలయిక అంటే అంచనాలను ఊహించలేం. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ఖైదీ, కొండవీటి దొంగ, స్టాలిన్ సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇది మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం అయి ఉంటుందని అందరి అంచనా. ఈ చిత్రానికి దర్శకత్వం చిరంజీవితో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వి.వి.వినాయక్ వహిస్తారట. ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాకి తన కుమారుడు హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాలీవుడ్ టాక్. -
హీరో రవితేజ సందడి
-
అమల క్లాప్, నాగ్ స్విచ్ఛాన్..అఖిల్ ఎంట్రీ.
-
వినాయక్ డైరెక్షన్లో అఖిల్?
-
చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా
విశాఖ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు. అందుకు సరైన కథ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వినాయక్ అక్కడ విలేకర్లతో మాట్లాడాడు. మహేష్ బాబు హీరోగా వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మరో ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీసే యోచన ఉందన్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో అదుర్స్ 2 కూడా తీయనున్నట్లు చెప్పాడు. భూ విక్రయానికి సంబంధించిన పని మీద వినాయక్ రావటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అతడిని చూసేందుకు, కలిసి ఫోటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. -
అంజలి లేకపోతే ఈ సినిమా లేదు
‘‘ఇప్పటికి 45 కథలు రాసిన నాకు రాజకిరణ్ చెప్పిన ఈ కథ విని నేనెందుకిలా ఆలోచించలేకపోయానా అనిపించింది. భారీ చిత్రాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నేను ఇలాంటి కథలను మరచిపోతున్నానేమో అనిపించింది. అంజలి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసేవాళ్లమే కాదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆయన సమర్పణలో, అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. వీవీ వినాయక్, గోపీచంద్, మంచు లక్ష్మి పాటల సీడీలను ఆవిష్కరించి, ఎమ్మెల్యే కోన రఘుపతికి అందించారు. వినాయక్ మాట్లాడుతూ -‘‘అసలు దెయ్యాలే లేవనే నమ్మే బ్రహ్మానందంగారికి దెయ్యం కనిపిస్తే పరిస్థితి ఏమిటనేది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ -‘‘మామూలు సినిమాల్లో బ్రహ్మనందం భయపడితే వంద రోజులు ఆడుతున్నాయి. అదే హారర్ సినిమాలో బ్రహ్మానందంగారు భయపడితే తప్పకుండా 150 రోజులు ఆడుతుంది’’ అని చెప్పారు. ఇది తనకు స్పెషల్ మూవీ అని అంజలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్, పోనీ వర్మ, దశరథ్, శ్రీవాస్, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, వీరు పోట్ల, మెహర్ రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో, మోనాల్ గజ్జర్, నీరజ కోన తదితరులు మాట్లాడారు.