
శంకర్ దర్శకత్వంలో...?
ఆరంభం, వీరమ్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు అజిత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎన్నయ్ అరిందాల్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అజిత్ అంగీకరించారట. శంకర్‌తో ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ నిర్మించిన ఏయం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెన్నయ్ టాక్.