
కల్యాణి
‘‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, కబడ్డీ కబడ్డీ, పెదబాబు’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్యాణి డైరెక్షన్ మార్చారు. దర్శక–నిర్మాతగా మారారు. ఇటీవల అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. చేతన్ శీను, సిద్ధి, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హోలి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.