
త్వరలో డెరైక్షన్ చేస్తా!
‘‘ ‘పాండవుల్లో ఒకడు’ మాతృక ‘కప్పల్’ను వాస్తవానికి తమిళంలో వేరే నిర్మాత తీశారు. దిగ్దర్శకుడు శంకర్ కు ఈ సినిమా బాగా నచ్చి, తమిళంలో ఆయనే విడుదల చేశారు’’ అని నటుడు వైభవ్ తెలిపారు. ఆయన హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శక త్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కప్పల్’ను దర్శకుడు మారుతి తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ- ‘‘పెళ్లయితే స్నేహం చెడి పోతుందన్న ఉద్దేశంతో ఓ అయిదుగురు యువకులు అమ్మాయిలకు దూరంగా ఉంటారు.
కానీ అను కోని పరిస్థితుల్లో వాసు అనే యువకుడు ప్రేమలో పడతాడు. వాసు ప్రేమను చెడగొట్ట డానికి వాళ్లు ఎలాంటి ప్లాన్‌లు వేస్తారు? మరి.. వాసూకి పెళ్లవుతుందా? అనే కథాంశంతో హాస్యభరితంగా ఈ చిత్రం సాగుతుంది. ఇందులో వాసుగా నటించాను. సోనమ్ బజ్వా నాయిక. నటరాజన్ శంకరన్ పాటలు హైలైట్’’ అని చెప్పారు. కాగా, గతంలో ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’, ‘శివమణి’కి దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవమున్న వైభవ్ త్వర లోనే డెరైక్ష న్ చేయాలనే ఆలోచన ఉందన్నారు.