ఆ పనిచేసే ఆలోచన లేదు: హీరోయిన్‌ | am not busy with direction plans says nithya menon | Sakshi
Sakshi News home page

ఆ పనిచేసే ఆలోచన లేదు: హీరోయిన్‌

Published Tue, May 30 2017 11:30 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

ఆ పనిచేసే ఆలోచన లేదు: హీరోయిన్‌

ఆ పనిచేసే ఆలోచన లేదు: హీరోయిన్‌

నటీమణుల్లో నిత్యామీనన్‌కు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. అయితే ఆ పాత్ర తనకు నచ్చితేనే ఒప్పుకుంటానని నిర్మొహమాటంగా చెప్పే నిత్య ఆ మధ్య మణిరత్నం అవకాశాన్ని కూడా నిరాకరించిందనే ప్రచారం జరిగింది. అయితే అమ్మడికి  ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం తనే అనే ప్రచారం కూడా చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందని, అందుకే నటిగా అవకాశాలను తిరస్కరిస్తోందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ఇది ఆ నోటా ఈ నోటా అమ్మడి చెవిన పడింది. అంతే.. అయ్యయ్యో దర్శకత్వం చేస్తానని తానెప్పుడు ఎవరితో చెప్పాను. ఇలా కూడా వదంతులు పట్టిస్తున్నారా? అంటూ రియాక్ట్‌ అయ్యింది. నిజం చెప్పాలంటే నటిగా తనకింకా చాలెంజింగ్‌ పాత్రలు చాలా చేయాలని ఉన్నట్లు చెప్పింది.
 
తనను దర్శకురాలిగా చూడటానికి చాలామంది ఎదురు చూస్తున్నారన్న విషయం ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో దర్శకత్వం గురించి ఆలోచిస్తాను అని వివరించింది. ప్రస్తుతం విజయ్‌ 61వ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నట్టు చెప్పింది. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌కు జోడీగా నిత్యామీనన్‌ నటిస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్‌ చాలా శాంత స్వభావి అని, ఆయనతో తొలిసారిగా నటిస్తున్నానని, అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని నిత్యా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement