విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నదనే టాక్ తాజాగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఓ సాధారణ కానిస్టేబుల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రీలీలను అనుకున్నారు. కానీ కాల్షీట్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బందులు రావడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రష్మికా మందన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో విజయ్–రష్మిక కాంబినేషన్‌లో ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment