
నటిగా, గాయనిగా నిత్యామీనన్‌కి ఫుల్ మార్క్స్ ఎప్పుడో వేశారు ప్రేక్షకులు. తనలో ఓ డైరెక్టర్ కూడా ఉన్నారు అని నిత్యా మీనన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఓ సినిమాను డైరెక్ట్ చేస్తానని కూడా అన్నారామె. అయితే ‘మీ దర్శకత్వంలో సినిమాను ఎప్పుడు చూడొచ్చు’ అని నిత్యాను అడిగితే ఇలా సమాధానమిచ్చారు–‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోలేదు. ఇందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు. ప్రస్తుతం నేను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ఇంకా విభిన్నమైన కథల ద్వారా, పాత్రల ద్వారా ప్రేక్షకులను పలకరించాలి’’ అన్నారు నిత్య. ప్రస్తుతం ‘19 (1) (ఎ)’ అనే మలయాళ చిత్రం, తెలుగులో సత్య దేవ్‌తో ‘స్కై ల్యాబ్’ సినిమా చేస్తున్నారు నిత్యా.
Comments
Please login to add a commentAdd a comment