
ఐశ్వర్యారాయ్
నటిగా తానేంటో నిరూపించుకున్నారు అందాల సుందరి ఐశ్వర్యారాయ్. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొడక్షన్, డైరెక్షన్ విభాగాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట ఐశ్వర్య. ‘‘ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా రకాల పాత్రలు చేశాను. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు ఆలోచన మొదలైంది. ఈ విషయంపై సీరియస్‌గా వర్క్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్ కావాలని ఉంది. భవిష్యత్తులో తప్పకుండా డైరెక్టర్ అవుతాను. నా సన్నిహితులు, స్నేహితులు ‘నువ్వు ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ అవొచ్చు కదా’ అని అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు వారి మాటలను నిజం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యారాయ్.
Comments
Please login to add a commentAdd a comment