‘ఇది నా లవ్ స్టోరీ’ ఫేమ్ రమేష్– గోపి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. రమణ్ హీరోగా వర్షా విశ్వనాథ్, పావని, దీపికా హీరోయిన్లుగా నటించనున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పణలో సిరి మూవీస్ పతాకంపై కె.శిరీషా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకులు రమేష్– గోపి మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లో మంచి సందేశాత్మకంగా రూపొందనున్న చిత్రమిది. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. నవంబర్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కెమెరా: క్రిస్టోఫర్ జోసెఫ్.
Comments
Please login to add a commentAdd a comment