
షకీలా టార్గెట్ ఎవరు?
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను,అన్యాయాలను ప్రశ్నించిన ఓ మహిళ కథే ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదే వి హీరో హీరోయిన్లుగా సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సమర్పకులు సయ్యద్ అఫ్జల్ మాట్లాడుతూ-‘‘షకీలా గారు చెప్పిన దాని కన్నా ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు.
ఈ కథ తెలిసిన కొంతమంది రాజకీయనాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వెనుకాడం’’ అని అన్నారు. షకీలా మాట్లాడుతూ -‘‘ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే విడుదల చేస్తాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్, పాటలు: సయ్యద్ అఫ్జల్, బొబ్బా, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్.