
సందేశంతో షకీలా సినిమా
నటిగా దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీలా దర్శకురాలిగా మారి, చేసిన చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. నరేష్, శ్వేతా శైన్, శ్రీదేవి ముఖ్య తారలుగా సయ్యద్ అఫ్జల్ సమర్పణలో మెంటా సత్యనారాయణ ఈ చిత్రం నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ - ‘‘ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం చేశాం. తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే ఆడవాళ్లు మహాశక్తిగా మారాలని చెప్పే చిత్రమిది. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్, వినోదాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: కార్తీక్, అభిషేక్, సహనిర్మాత: జల్లెపల్లి నరేష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్.