Romantic Target
-
షకీలా టార్గెట్ ఎవరు?
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను,అన్యాయాలను ప్రశ్నించిన ఓ మహిళ కథే ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదే వి హీరో హీరోయిన్లుగా సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సమర్పకులు సయ్యద్ అఫ్జల్ మాట్లాడుతూ-‘‘షకీలా గారు చెప్పిన దాని కన్నా ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఈ కథ తెలిసిన కొంతమంది రాజకీయనాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వెనుకాడం’’ అని అన్నారు. షకీలా మాట్లాడుతూ -‘‘ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే విడుదల చేస్తాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్, పాటలు: సయ్యద్ అఫ్జల్, బొబ్బా, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్. -
స్త్రీ ఆదిపరాశక్తిగా మారితే...
స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ఎవరో రావాల్సిన పనిలేదు. ఆడదే ఆదిపరాశక్తిగా మారి జరుగుతున్న వాటికి సమాధానం ఇవ్వచ్చనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా మెంటా సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకురాలు మాట్లాడుతూ-‘‘యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్-కార్తీక్, మాటలు: సాయి-నండూరి వీరేష్, ఎడిటింగ్: సునిల్ అళహరి, కెమెరా: కె. శ్రీనివాసరెడ్డి, సమర్పణ: సయ్యద్ అఫ్జల్, సహనిర్మాత: జల్లేపల్లి నరేశ్.. -
సందేశంతో షకీలా సినిమా
నటిగా దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీలా దర్శకురాలిగా మారి, చేసిన చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. నరేష్, శ్వేతా శైన్, శ్రీదేవి ముఖ్య తారలుగా సయ్యద్ అఫ్జల్ సమర్పణలో మెంటా సత్యనారాయణ ఈ చిత్రం నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ - ‘‘ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం చేశాం. తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే ఆడవాళ్లు మహాశక్తిగా మారాలని చెప్పే చిత్రమిది. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్, వినోదాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: కార్తీక్, అభిషేక్, సహనిర్మాత: జల్లెపల్లి నరేష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్. -
మహాశక్తిగా మారాలి...
దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించారు షకీలా. ఆ అనుభవంతో తొలి ప్రయత్నంగా ఆమె ‘రొమాంటిక్ టార్గెట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నారు. నరేష్, శ్వేత, శ్రీదేవి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను షకీలా తెలియజేస్తూ - ‘‘ప్రస్తుత సమాజంలో తమపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ఆడవాళ్లు మహాశక్తిగా మారి ఎలా ఎదుర్కోవాలి? అని చెప్పే చిత్రమిది. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: కార్తీక్, అభిషేక్, సహనిర్మాత: జల్లెపల్లి నరేష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్, నిర్మాత: మెంటా సత్యనారాయణ.