
స్త్రీ ఆదిపరాశక్తిగా మారితే...
స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ఎవరో రావాల్సిన పనిలేదు. ఆడదే ఆదిపరాశక్తిగా మారి జరుగుతున్న వాటికి సమాధానం ఇవ్వచ్చనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా మెంటా సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకురాలు మాట్లాడుతూ-‘‘యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్-కార్తీక్, మాటలు: సాయి-నండూరి వీరేష్, ఎడిటింగ్: సునిల్ అళహరి, కెమెరా: కె. శ్రీనివాసరెడ్డి, సమర్పణ: సయ్యద్ అఫ్జల్, సహనిర్మాత: జల్లేపల్లి నరేశ్..