నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్ | Kushi Fame SJ Surya Not Interested with Direction | Sakshi
Sakshi News home page

నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్

Published Fri, Sep 22 2017 3:29 PM | Last Updated on Fri, Sep 22 2017 5:52 PM

నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్

నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్

దక్షిణాదిలో సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్ జె సూర్య. వాలి, ఖుషి, న్యూ (తెలుగులో నాని) లాంటి సినిమాలకు

దక్షిణాదిలో సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్ జె సూర్య. వాలి, ఖుషి, న్యూ (తెలుగులో నాని) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య, తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. అయితే న్యూ తరువాత దర్శకుడిగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించటంలో విఫలమవుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాల్లోనూ నటిస్తున్నారు.

త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న మహేష్ బాబు స్పైడర్ తో పాటు విజయ్ మెర్సల్ సినిమాల్లోనూ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఘన విజయాలు అందించిన ఈ దర్శకుడు ఇక దర్శకత్వం వహించేది లేదని చెప్పేశారు. ఇప్పటికే డైరెక్టర్ గా చాలా సాధించానని, ఇక పై నటుడిగానే కొనసాగుతానని తెలిపారు. తాను సినీ రంగానికి నటుడు కావాలన్న కోరికతోనే వచ్చానని, అనుకోకుండా దర్శకుడిగా మారానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement