రామ్ చరణ్‌ సాంగ్‌కు స్టెప్పులేసిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్! | SJ Surya Steps Ram Charan Game Changer Movie Song Video Goes Viral | Sakshi
Sakshi News home page

SJ Surya: గేమ్ ఛేంజర్ సాంగ్‌కు స్టెప్పులేసిన ఎస్‌జే సూర్య.. వీడియో వైరల్!

Published Mon, Sep 30 2024 6:40 PM | Last Updated on Mon, Sep 30 2024 6:54 PM

SJ Surya Steps Ram Charan Game Changer Movie Song Video  Goes Viral

కోలీవుడ్ స్టార్‌  ఎస్‌జే సూర్య ఇటీవలే సరిపోదా శనివారం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి రా మచ్చా మచ్చా అనే లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్.

(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది!)

ఈ పాటకు తన స్టెప్పులతో అలరించారు ఎస్‌జే సూర్య. డ్యాన్స్‌ చేస్తూ వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement