Aishawarya Rajinikanth Enters Into Bollywood With Oh Saathi Chal - Sakshi
Sakshi News home page

Aishawarya Rajinikanth: 'ఎంతో సంతోషంగా ఉంది.. నా ప్రయాణం మొదలుపెడుతున్నా'..

Published Tue, Mar 22 2022 8:27 AM | Last Updated on Tue, Mar 22 2022 9:34 AM

Aishawarya Rajinikanth Enters Into Bollywood With Oh Saathi Chal - Sakshi

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యకి బాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. తమిళ చిత్ర సీమలో డైరెక్టర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు హిందీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆమె స్వయంగా ప్రకటించారు. ‘‘ఈ వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించలేను.

దర్శకురాలిగా బాలీవుడ్‌లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ‘ఓ సాథీ చల్‌’ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు ఐశ్వర్య. కాగా ‘ఓ సాథీ చల్‌’ అనే సినిమాని సీ9 పిక్చర్స్‌ నిర్మించనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement