ఆసియా కుబేరుడు ముకేశ్‌: ఫోర్బ్స్‌ | Asian personal wealth Mukesh: Forbes | Sakshi
Sakshi News home page

ఆసియా కుబేరుడు ముకేశ్‌: ఫోర్బ్స్‌

Nov 1 2017 11:35 PM | Updated on Nov 2 2017 1:32 PM

 Asian personal wealth Mukesh: Forbes - Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సామ్రాజ్యాధినేత ముకేశ్‌ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆయనీ ఘనత సొంతం చేసుకున్నారు. ఆర్‌ఐఎల్‌ షేరు బుధవారం 1.22 శాతం పెరగడంతో ముకేశుడి వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్‌ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుడిగా ముకేశ్‌ అవతరించారు.

చైనా ఈవర్‌గ్రాండ్‌ గ్రూపు చైర్మన్‌ హు కా యాన్‌ సంపద బుధవారం నాటికి 1.28 బిలియన్‌ డాలర్ల మేర తగ్గి 40.6 బిలియన్‌ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు) వద్ద ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముకేశుడు 14వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్‌ సంస్థ తెలిపింది. ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌భారతీ మిట్టల్‌ కూడా తన సంపద విలువను 751 మిలియన్‌ డాలర్లు పెంచుకున్నారు. ఆయన మొత్తం సంపద విలువ 10.9 బిలియన్‌ (రూ.70,000 కోట్లు)డాలర్లుగా ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement