Radhika Merchant Carries Mini Bag Worth Rs 52 Lakhs at NMACC Event - Sakshi
Sakshi News home page

Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?

Published Sun, Apr 2 2023 1:03 PM | Last Updated on Sun, Apr 2 2023 4:22 PM

radhika merchant carries mini bag worth rs 52 lakhs at nmacc event - Sakshi

రిలయన్స్‌ అధినేత  ముఖేష్‌​ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఎన్‌ఎంఏసీసీ (నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌) ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబానీ ఇంటికి కాబోయే కోడలు, అనంత్‌ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ అందరి దృష్టినీ ఆకర్షించారు.

(కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..  అమల్లోకి కొత్త ధరలు)

 

రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ  ప్రముఖులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేసిన ఈ వేడుకల్లో రాధికా మర్చంట్ నల్ల చీరలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న వెండి రంగు హెర్మేస్ కెల్లీమార్ఫోస్ మినీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. bollywoodshaadis.com కథనం ప్రకారం.. ఫ్యాషన్‌స్టాలో ఈ చిన్న బ్యాగ్ ధర అక్షరాలా రూ.52,30,000. ఇంత ఖరీదైన బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రా, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి.

(The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) 

ఈ వేడుకలో రాధికా మర్చంట్‌ నలుపు రంగులో ఉన్న ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ చీరలో అద్భుతంగా కనిపించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి చిన్న కొడుకుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ గత జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement