ఇషా, ఆకాష్‌ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా? | do Know how Mukesh Ambani and Nita get Isha Akash Ambani names meaning | Sakshi
Sakshi News home page

ఇషా, ఆకాష్‌ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా?

Published Wed, Oct 23 2024 3:53 PM | Last Updated on Wed, Oct 23 2024 6:42 PM

do Know how Mukesh Ambani and Nita get Isha Akash Ambani names meaning

రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ.  ఐవీఎఫ్‌ ద్వారా  ఈ కవల పిల్లలకు జన్మనిచ్చారు నీతా అంబానీ. అక్టోబర్ 23న పుట్టిన ఇషా , ఆకాష్‌ అంబానీలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

ఇషా, ఆకాష్‌ అంబానీ పుట్టిన రోజు సందర్బంగా గతంలో డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాతో నీతా అంబానీ సంభాషణ ఇపుడు వైరల్‌గా మారింది.  ఇందులో  తన కవల పిల్లలు ఇషా, ఆకాష్ పేర్ల వెనుకున్న కథను నీతా పంచుకున్నారు.

కవలల పిల్లల  ప్రసవం కోసం తాను అమెరికాలో ఉన్నానని నీతా తెలిపారు. అపుడు  నత భర్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ   తనను కలిసి ఇండియా వెళ్లేందుకు  విమానం దిగారో  లేదో వెంటనే అమెరికా బయలుదేరాల్సి వచ్చింది.  ఎందుకంటే... నెలలకు నిండకుండానే. ఇషా, ఆకాష్‌కు జన్మనిచ్చారట నీతా.  దీనితో ముఖేష్ U.S.కి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..నీతాకు డెలివరీ అయిందన్న సంగతి తెలియగానే  అంబానీతోపాటు, నీతా తల్లి, డాక్టర్ ఫిరోజా, విమానంలో అమెరికాకు బయలు దేరారు. అపుడు వారు ప్రయాణిస్తున్న విమానం పైలట్ ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించారు.  

అంతేకాదు తమ పిల్లలకు ఇషా, ఆకాష్‌ పేర్లు ఎలా పెట్టిందీ వివరించారు నీతా.  పిల్లలకు పేర్ల చర్చ వచ్చినపుడు పర్వతాల మీదుగా ఆకాశంలో ఎగురుతున్నపుడు  ఈ వార్త తెలిసింది  కాబట్టి  అమ్మాయికి ఇషా (పర్వతాల దేవత) ఆకాష్‌ (ఆకాశం) అని అనే పేర్లు పెడదామని చెప్పారట అంబానీ.  అదీ సంగతి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పుట్టిన మూడేళ్ల తర్వాత వారి మూడో సంతానం అనంత్ అంబానీ జన్మించాడు. 

కాగా ప్రస్తుతం ఇషా, ఆకాష్‌, అనంత్‌  రిలయన్స్‌వ్యాపార  సమ్రాజ్య బాధ్యతల్లో ఉన్నారు.   ఆకాష్‌ , డైమండ్స్‌ వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాను పె ళ్లాడాడు వీరికి  ఇద్దరు సంతానం. వ్యాపారవేత్త ఆనంద్‌పిరమిల్‌ వివాహమాడిన ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. అనంత్‌ తన చిన్న నాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జూలైలో  అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement