
దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖేష్ అంబానీ లగ్జరీ లైఫ్ గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. అయితే ముఖేష్ అంబానీ ఆధ్మాత్మికతపై అమితమైన మక్కువ చూపిస్తారనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేశంలోని చాలా ఆలయాలకు తరచూ ముఖేష్ అంబానీ వెళుతుంటారు. వీటిలో ఒకటే నాథద్వారాలో కొలువైన శ్రీనాథ్ దేవాలయం.
రాజస్థాన్‌లోని నాథద్వారాలోని ఆలయానికి ముఖేష్ అంబానీ చాలాకాలంగా వస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముఖేష్ అంబానీ మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్లు కూడా ఇక్కడికి వస్తుంటారు.ఈ మందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నాథద్వారా ప్రాంతం ఉదయపూర్‌కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి రైలులో లేదా విమానంలో ఉదయ్‌పూర్ చేరుకున్నాక అక్కడి నుంచి ఆలయానికి వెళ్లవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్టుని అవతారమైన శ్రీనాథుడు కొలువైవున్నాడు.
రాజస్థాన్‌కు చెందిన ప్రజలు ఇక్కడికి తరచూ వస్తుంటారు. శ్రీనాథ మందిర నిర్మాణం 17వ శతాబ్ధంలో జరిగింది. ఆలయాన్ని మహారాజా రాజాసింగ్ కట్టించారు. ఆలయానికి విశాల ప్రాంగణం ఉంది. అలయంలోనికి ప్రవేశించేందుకు నలువైపులా ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో శ్యామల వర్ణంలోని శ్రీనాథుడు కొలువైవున్నాడు.హోలీనాడు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. లెక్కకు మించిన జనం ఆలయం వద్దకు చేరుకుంటారు.
ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఆలయ పరిసరాల్లో భక్తులకు వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. ఇటీవలికాలంలో ఇది పర్యాటక స్థలంగానూ అభివృద్ధి చెందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment