ఇషా అంబానీ వివాహం : మొదటి ఆహ్వానం ఎవరికంటే | Amban Family Visit Siddhivinayak Temple To Offer Isha Ambani Wedding Card | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 7:08 PM | Last Updated on Tue, Oct 30 2018 7:09 PM

Amban Family Visit Siddhivinayak Temple To Offer Isha Ambani Wedding Card - Sakshi

ముంబై : అంబానీ కుటుంబంలో సంతోషాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇటలీ లేక్‌ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు.

ఈ క్రమంలో నిన్న రాత్రి అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించారు. ఇషా - పిరమిల్‌ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముకేష్‌ అంబానీ దంపతులతో పాటు వారి కుమారుడు అనంత్‌ అంబానీ.. ముకేష్‌ అంబానీ తల్లి కోకిలా బెన్‌ కూడా హాజరయ్యారు. గతంలో ముకేష్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ - శ్లోకా మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement