రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా శాఖాహారమే తీసుకోవడం గమనార్హం. ఇటీవల అంబానీ డ్రైవర్‌కు ఇచ్చే జీతం గురించి తెలిసింది, కాగా ఇప్పుడు వంటమనిషికి ఎంత జీతం ఇస్తారన్నది వెలుగులోకి వచ్చింది.
చాలా సాధారణమైన ఆహారం తీసుకునే ముకేశ్ అంబానీ ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారని, అంతే కాకుండా అప్పుడప్పుడు సరికొత్త వంటకాలు కూడా రుచిచూస్తారని సమాచారం. అంబానీ ఆహారపు అలవాట్లు ఆయన సాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయని చెబుతారు.
ముకేశ్ అంబానీకి సాధారణ వంటకాలతో పాటు థాయ్ వంటకాలంటే కూడా చాలా ఇష్టమని సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆదివారం రోజు ఇడ్లీ సాంబార్ ఉండి తీరాల్సిందే అంటున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్న రాత్రి భోజం మాత్రం కుటుంబంతో కలిసి చేస్తారని గతంలో నీతా అంబానీ చెప్పారు.
(ఇదీ చదవండి: భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్‌జి లాంచ్.. పూర్తి వివరాలు)
అంబానీ ప్రతి రోజు తీసుకునే ఆహారానికి సంబంధించి కీలక పాత్ర చెఫ్‌ది (వంట మనిషి) అనే చెప్పాలి. ఎప్పుడు ఏమి తింటారనేది కూడా వారే చూసుకుంటారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకునే వంటమనిషి జీతం భారతదేశంలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల జీతంకంటే ఎక్కువని తెలుస్తోంది. సుమారు అంబానీ వంటమనిషి జీతం రూ. 2 లక్షల కంటే ఎక్కువే అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment