అనంత్‌ అంబానీ పెళ్లిపై ఆలియా సంచలన వ్యాఖ్యలు | Anurag Kashyap Daughter Aaliyah Kashyap Sensational Comments On Anant Ambani Marriage, Post Viral | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ పెళ్లిపై ఆలియా సంచలన వ్యాఖ్యలు

Published Thu, Jul 11 2024 12:55 PM | Last Updated on Thu, Jul 11 2024 1:42 PM

Anurag Kashyap Daughter Aaliyah Kashyap Sensational Comments On Anant Ambani Marriage

ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుభేరుడు ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి శుక్రవారం(జులై 12) ముంబైలో జరగనుంది. ఇప్పటికే ఏర్పట్లు అన్ని పూర్తి చేశారు. ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపార, సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరకానునున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్స్‌ జరిగాయి. ఈ ఈవెంట్స్‌కి బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా హాజరై సందడి చేశారు. 

(చదవండి: క్లీంకారతో ముంబయికి రామ్ చరణ్‌.. ఎందుకో తెలుసా?)

రేపు జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్‌ ప్రముఖులంతా హాజరుకానున్నారు. ఇప్పటికే సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు అందించారు. పలువురు స్టార్స్‌ కూడా పెళ్లికి కోసం తమ షెడ్యూల్‌ని మార్చుకున్నారు. అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం పంపినా.. పెళ్లికి మాత్రం వెళ్లనని చెబుతోంది ప్రముఖ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఆలియా కశ్యప్‌. అంతేకాదు అనంత్‌ అంబానీ పెళ్లి.. పెళ్లిలా కాకుండా ఒక సర్కస్‌లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

(చదవండి: పెళ్లి వేడుకల్లో మెరిసిన దేవర భామ.. పక్కనే బాయ్‌ఫ్రెండ్‌ కూడా!)

‘నన్ను ఓ ఈవెంట్‌కి ఆహ్వానించారు. కానీ నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం ఆత్మగౌరవం ఉంది. ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యం’ అని అలియా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.  ప్ర‌స్తుతం ఆలియా వ్యాఖ్య‌ల‌పై  నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అంబానీ ఇంట పెళ్లి అంటే.. బాలీవుడ్‌ మొత్తం పండగ చేసుకుంటుంది. స్టార్‌ హీరోహీరోయిన్లు పెళ్లిలో డ్యాన్స్‌ చేసి సందడి చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్‌ స్టార్లంతా ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు తహతహలాడతారు. అంబానీ ప్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్‌కి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement