Aaliyah Kashyap
-
పెళ్లిలో కంటతడి.. అల్లుడిని వెనకేసుకొచ్చిన దర్శకుడు
ప్రముఖ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఇటీవలే పెళ్లి చేసుకుంది. ప్రియుడు షేన్ గ్రెగోయిర్తో ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులోని ఓ వీడియోలో పెళ్లికూతురిలా ముస్తాబైన ఆలియా మండపంలో నిల్చున్న తనవైపు నడుచుకుంటూ వస్తుంటే షేన్ సంతోషంతో ఏడ్చేశాడు.నా అల్లుడు అలాంటివాడుదీన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ఇదంతా డ్రామా.. అటెన్షన్ కోసమే ఇలా చేశాడని విమర్శించారు. తన అల్లుడిపై జరుగుతున్న ట్రోలింగ్‌పై అనురాగ్ స్పందించాడు. నా అల్లుడు ఎంతో సున్నిత మనస్కుడు. అతడు నా కూతురిపై ప్రత్యేక ప్రేమ చూపిస్తాడు. ఇలా పెళ్లి ఏడవడమనేది ట్రెండ్ అని.. అది షేన్ ఫాలో అయిపోయి వైరల్ అవ్వాలని చూశాడనుకుంటే పొరపాటే అవుతుంది. ఇంత మంచి అల్లుడు దొరకాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. ఏడ్చినా తప్పేనా?ఒక తండ్రిగా చెప్తున్నా.. షేన్కున్న మంచితనంలో నాకు సగం కూడా లేదు అని చెప్పుకొచ్చాడు. అనురాగ్ రిప్లైకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నిజమైన ఎమోషన్స్ చూపిస్తే కూడా జనాలు తప్పుపడుతున్నారేంటోనని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆలియా- షేన్ ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 11న పెళ్లి పీటలెక్కారు. View this post on Instagram A post shared by FOURFOLD PICTURES (@fourfoldpictures)చదవండి: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్ -
అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లి పార్టీలో.. నాగ చైతన్య,శోభిత (ఫొటోలు)
-
అనురాగ్ కశ్యప్ కూతురి సంగీత్ వేడుక..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
అనంత్ అంబానీ పెళ్లిపై ఆలియా సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం(జులై 12) ముంబైలో జరగనుంది. ఇప్పటికే ఏర్పట్లు అన్ని పూర్తి చేశారు. ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపార, సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరకానునున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ జరిగాయి. ఈ ఈవెంట్స్‌కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు. (చదవండి: క్లీంకారతో ముంబయికి రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?)రేపు జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరుకానున్నారు. ఇప్పటికే సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు అందించారు. పలువురు స్టార్స్ కూడా పెళ్లికి కోసం తమ షెడ్యూల్‌ని మార్చుకున్నారు. అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం పంపినా.. పెళ్లికి మాత్రం వెళ్లనని చెబుతోంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్. అంతేకాదు అనంత్ అంబానీ పెళ్లి.. పెళ్లిలా కాకుండా ఒక సర్కస్‌లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.(చదవండి: పెళ్లి వేడుకల్లో మెరిసిన దేవర భామ.. పక్కనే బాయ్‌ఫ్రెండ్ కూడా!)‘నన్ను ఓ ఈవెంట్‌కి ఆహ్వానించారు. కానీ నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం ఆత్మగౌరవం ఉంది. ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యం’ అని అలియా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలపై నెట్టింట వైరల్ అవుతున్నాయి.అంబానీ ఇంట పెళ్లి అంటే.. బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది. స్టార్ హీరోహీరోయిన్లు పెళ్లిలో డ్యాన్స్ చేసి సందడి చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్లంతా ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు తహతహలాడతారు. అంబానీ ప్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్‌కి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. Aliyah Kashyap (Anurag Kashyap's daughter) talks about the PR involved in the Ambani wedding on her Instagram channel. Influencers are being invited to promote wedding.Although this is hard to digest. They don’t need the PR thing to promote the wedding + it also takes away the… pic.twitter.com/kezmfnsk0b— Vineet Sharma (@Vineet_Sir_) July 8, 2024