ప్రముఖ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఇటీవలే పెళ్లి చేసుకుంది. ప్రియుడు షేన్ గ్రెగోయిర్‌తో ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులోని ఓ వీడియోలో పెళ్లికూతురిలా ముస్తాబైన ఆలియా మండపంలో నిల్చున్న తనవైపు నడుచుకుంటూ వస్తుంటే షేన్ సంతోషంతో ఏడ్చేశాడు.
నా అల్లుడు అలాంటివాడు
దీన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ఇదంతా డ్రామా.. అటెన్షన్ కోసమే ఇలా చేశాడని విమర్శించారు. తన అల్లుడిపై జరుగుతున్న ట్రోలింగ్‌పై అనురాగ్ స్పందించాడు. నా అల్లుడు ఎంతో సున్నిత మనస్కుడు. అతడు నా కూతురిపై ప్రత్యేక ప్రేమ చూపిస్తాడు. ఇలా పెళ్లి ఏడవడమనేది ట్రెండ్ అని.. అది షేన్ ఫాలో అయిపోయి వైరల్ అవ్వాలని చూశాడనుకుంటే పొరపాటే అవుతుంది. ఇంత మంచి అల్లుడు దొరకాలని నేను ఎన్నడూ కోరుకోలేదు.
ఏడ్చినా తప్పేనా?
ఒక తండ్రిగా చెప్తున్నా.. షేన్‌కున్న మంచితనంలో నాకు సగం కూడా లేదు అని చెప్పుకొచ్చాడు. అనురాగ్ రిప్లైకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నిజమైన ఎమోషన్స్ చూపిస్తే కూడా జనాలు తప్పుపడుతున్నారేంటోనని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆలియా- షేన్ ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 11న పెళ్లి పీటలెక్కారు.
చదవండి: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్
Comments
Please login to add a commentAdd a comment