2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు | NxtWave Founders Anupam Pedarla Sashank Reddy Gujjula Winners Of Forbes India 30 Under 30 List 2024 | Sakshi
Sakshi News home page

2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

Feb 15 2024 7:16 PM | Updated on Feb 15 2024 7:34 PM

NxtWave Founders Anupam Pedarla Sashank Reddy Gujjula Winners Of Forbes India 30 Under 30 List 2024 - Sakshi

2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ 'నెక్స్ట్ వేవ్' స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం.

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన 'శశాంక్ గుజ్జుల' ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన 'అనుపమ్ పెదర్ల' ఐఐటీ ఖరగపూర్‌లో బి.టెక్ పూర్తి చేశాడు.

ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని 'రాహుల్ అత్తులూరి'తో కలిసి 'నెక్స్ట్ వేవ్' స్థాపించారు.

నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా  పొందారు. 

అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకుంటున్నారు. 

ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు, ఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు.

నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటి నైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement