అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? | Top ten largest economies in the world 2023 | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?

Published Sat, Sep 2 2023 3:44 PM | Last Updated on Sat, Sep 2 2023 4:17 PM

Top ten largest economies in the world 2023 - Sakshi

భారతదేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే టెక్నాలజీ ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. ఈ కారణంగా 2023లో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా 5 వ స్థానంలో చేరింది. ఒక దేశం GDPని అంచనా వేయడానికి మొత్తం వినియోగ వస్తువులు, కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతుల నికర విలువ ఉపయోగపడుతుంది. అయితే 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో అమెరికా మొదటి జాబితాలో ఉంది. ఐదవ స్థానంలో భారత్ చేరగా.. 10వ స్థానంలో బ్రెజిల్ ఉంది.

2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 దేశాలు & జీడీపీ..

  • అమెరికా - 26854 బిలియన్ డాలర్లు
  • చైనా - 19374 బిలియన్ డాలర్లు
  • జపాన్ - 4410 బిలియన్ డాలర్లు
  • జర్మనీ - 4309 బిలియన్ డాలర్లు
  • ఇండియా - 3750 బిలియన్ డాలర్లు
  • యూకే - 3159 బిలియన్ డాలర్లు
  • ఫ్రాన్స్ - 2924 బిలియన్ డాలర్లు
  • ఇటలీ - 2170 బిలియన్ డాలర్లు
  • కెనడా - 2090 బిలియన్ డాలర్లు
  • బ్రెజిల్ - 2080 బిలియన్ డాలర్లు

ప్రపంచంలోని టాప్ 10 దేశాల వారీగా జీడీపీ..
👉అమెరికా
జీడీపీ: 26854 బిలియన్
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 80,030 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.6 శాతం

👉చైనా
జీడీపీ: 19374 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 13,720 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.2 శాతం

👉జపాన్
జీడీపీ: 4,410 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 35,390 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.3 శాతం

👉జర్మనీ
జీడీపీ: 4,309 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 51,380 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.1 శాతం

👉ఇండియా
జీడీపీ: 3,750 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 2,601 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.9 శాతం

👉యూకే (యునైటెడ్ కింగ్‌డమ్)
జీడీపీ: 3,159 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 46,370 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.3 శాతం

👉ఫ్రాన్స్
జీడీపీ: 2,924 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 44,410 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం

👉ఇటలీ
జీడీపీ: 2,170 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 36,810 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం

👉కెనడా
జీడీపీ: 2,090 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 52,720 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.5 శాతం

👉బ్రెజిల్
జీడీపీ: 2,080 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 9,670 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.9 శాతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement