58 భారతీయ కంపెనీల్లో రిలయన్సే టాప్
58 భారతీయ కంపెనీల్లో రిలయన్సే టాప్
Published Thu, May 25 2017 7:37 PM | Last Updated on Thu, Oct 4 2018 4:43 PM
ముంబై : ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' జాబితాలో భారతీయ కంపెనీల్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 58 కంపెనీలు భారతీయ కంపెనీలు ఈ జాబితాలో చోటుదక్కించుకోగా.. వాటన్నంటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిస్థానంలో ఉంది. సంచలనమైన ఆఫర్లతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుతో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ కంపెనీ బలపర్చిందని ఫోర్బ్స్ ఇండియా ఎడిషన్ గురువారం పేర్కొంది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ఫోర్బ్స్ ఈ ర్యాంకింగ్స్ ను ప్రతేడాది విడుదల చేస్తోంది.
వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీల ఈ జాబితాలో భారత్ నుంచి బ్యాంకులు, ఐటీ కంపెనీలే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారత కంపెనీల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీలు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహింద్రాలు కూడా గ్లోబల్ 200 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్ భారత కంపెనీల్లో ఆరవ స్థానంలో ఉంది. అయితే గతేడాది కంటే ఈ కంపెనీ ర్యాంకింగ్ పడిపోయింది. అయితే ఈ జాబితాలో చైనా, అమెరికా కంపెనీలే 40 శాతం స్థానాలను ఆక్రమించి, తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి.
Advertisement