Indian firms
-
సోనాలికా చిన్న కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్ త్వరలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్‌కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్‌కు రూపకల్పన చేసినట్టు పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ నెదర్లాండ్స్ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్‌తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది. నడపడం సులభం.. యూరప్‌లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. -
టాప్ 100 స్టార్టప్‌లలో భారత్ సంస్థలు.. దిగ్గజాల సరసన చోటు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిస్కులను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషించే సాంకేతికతను జాక్‌మాజ్ రూపొందిస్తోంది. నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ .. క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: లక్ష ఉద్యోగాలు, 10వేల స్టార్టప్‌లకు గండం
న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత వల్ల దానితో ముడిపడి ఉన్న అంకుర సంస్థల్లో ఆందోళన నెలకొంది. తక్షణ ఆర్థిక అవసరాలకు కావాల్సిన నిధుల కోసం అవి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10,000 చిన్న సంస్థలు .. వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పిటీషన్లో వై కాంబినేటర్ (వైసీ) తెలిపింది. దీని వల్ల 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా కట్టడి చేయకపోతే .. యావత్ అమెరికా టెక్నాలజీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 3,500 మంది పైచిలుకు సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, రెండు లక్షల మంది పైగా స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఈ పిటీషన్‌పై సంతకం చేశాయి. వీటిలో పేవో, సేవ్ఇన్, శాలరీబుక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్క్యుబేటర్ సంస్థ అయిన వై కాంబినేటర్ కమ్యూనిటీలోని మూడో వంతు స్టార్టప్‌లకు ఎస్వీబీలో మాత్రమే ఖాతాలు ఉన్నాయి. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) ఎస్వీబీలో భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని బడా టెక్ సంస్థలకు (వై కాంబినేటర్తో సంబంధమున్నవి) అమెరికాతో పాటు భారత్‌లోనూ కార్యకలాపాలు ఉన్నాయని ఫిన్‌టెక్ కంపెనీ రికర్ క్లబ్ సీఈవో ఏకలవ్య గుప్తా తెలిపారు. దేశీయంగా గిఫ్ట్ సిటీలో అకౌంట్లు తెరిచేందుకు ఆయా స్టార్టప్‌లకు తాము సహాయం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలోలాగా ఎస్వీబీని ప్రభుత్వం బెయిలవుట్ చేయబోదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్ స్పష్టం చేశారు. అయితే, డిపాజిటర్లందరికీ వారి సొమ్ము తిరిగి అందేలా చూసేందుకు చర్యలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభానికి నేటి పరిస్థితులకు వ్యత్యాసం ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని చెప్పారు. సత్వర టేకోవర్‌కు ఆస్కారం.. ఈ సమస్య స్వల్పకాలికమైనదే కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. క్లయింట్ల సొమ్మును తిరిగిచ్చేందుకు సరిపడేంత అసెట్లు ఎస్వీబీ దగ్గర ఉండటంతో పాటు, పలు ప్రముఖ సంస్థల ఖాతాలూ ఉన్న నేపథ్యంలో బ్యాంకును సత్వరమే ఏదో ఒక సంస్థ టేకోవర్ చేయొచ్చని తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోనే ఇది జరగవచ్చని ఇన్‌మొబి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అభయ్ సింఘాల్ చెప్పారు. స్వల్పకాలికంగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కోసం 7-8 బిలియన్ డాలర్ల నిధులు అవసరం కావచ్చని, అవి అందితే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావచ్చని పేర్కొన్నారు. ఏవో కొన్నింటిపై మినహా మిగతా స్టార్టప్‌లపై ఎస్వీబీ సంక్షోభ ప్రభావం ఉండకపోవచ్చని జెన్‌ప్యాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిన్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య స్థానికమైందే తప్ప అంతర్జాతీయ మైంది కాదన్నారు. భారతీయ స్టార్టప్‌లకు ఎస్వీబీతో చెప్పుకోతగ్గ స్థాయిలో లావాదేవీలేమీ లేవు కాబట్టి అవి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పరిశ్రమ నిపుణుడు, 5ఎఫ్ వరల్డ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు. ఎస్వీబీతో లావాదేవీలు జరిపే సంస్థలు కూడా కాస్త ఓపిక పడితే తమ సొమ్మును తిరిగి పొందడానికి వీలుంటుందన్నారు. మరోవైపు, తమ రెండు అనుబంధ సంస్థలకు (కిడోపియా, మీడియా వర్కజ్క్) ఎస్వీబీలో సుమారు రూ. 64 కోట్లు ఉన్నాయని గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, వాటి చేతిలో తగినన్ని నిధులు ఉన్నాయని, ఎస్వీబీ పరిణామం వల్ల వాటి వ్యాపారంపై ప్రభావమేమీ పడబోదని పేర్కొంది. అంకురాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి.. దేశీ సంస్థలపై ఎస్వీబీ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వారంలో దేశీ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా ఎదుగుతున్న అంకుర సంస్థలకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందించగలదన్నది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. -
58 భారతీయ కంపెనీల్లో రిలయన్సే టాప్
ముంబై : ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' జాబితాలో భారతీయ కంపెనీల్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 58 కంపెనీలు భారతీయ కంపెనీలు ఈ జాబితాలో చోటుదక్కించుకోగా.. వాటన్నంటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిస్థానంలో ఉంది. సంచలనమైన ఆఫర్లతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుతో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ కంపెనీ బలపర్చిందని ఫోర్బ్స్ ఇండియా ఎడిషన్ గురువారం పేర్కొంది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ఫోర్బ్స్ ఈ ర్యాంకింగ్స్ ను ప్రతేడాది విడుదల చేస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీల ఈ జాబితాలో భారత్ నుంచి బ్యాంకులు, ఐటీ కంపెనీలే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారత కంపెనీల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీలు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహింద్రాలు కూడా గ్లోబల్ 200 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్ భారత కంపెనీల్లో ఆరవ స్థానంలో ఉంది. అయితే గతేడాది కంటే ఈ కంపెనీ ర్యాంకింగ్ పడిపోయింది. అయితే ఈ జాబితాలో చైనా, అమెరికా కంపెనీలే 40 శాతం స్థానాలను ఆక్రమించి, తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. -
అమెరికాపై నాస్కామ్ కౌంటర్ అటాక్
హెచ్-1బీ వీసాలను ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు అక్రమంగా కైవసం చేసుకుంటున్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ తిప్పికొట్టింది. ఈ రెండు కంపెనీలకు కేవలం 8.8 శాతం అంటే 7,504 వీసాలు మాత్రమే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమయ్యాయని నాస్కామ్ సోమవారం పేర్కొంది. టాప్ 20 హెచ్-1బీ గ్రహీతల్లో భారత కంపెనీలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయని కూడా నాస్కామ్ తెలిపింది. వీసా లాటరీ సిస్టమ్ దుర్వినియోగపరుస్తూ దేశీయ టాప్ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రోలు ఎక్కువగా లబ్ది పొందుతాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. మూడు టాప్ హెచ్-1బీ వీసాల గ్రహీతల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలే ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా డేటాపై నాస్కామ్ కౌంటరిచ్చింది. మొత్తం ఆమోదమయ్యే హెచ్-1బీ వీసాలలో 20శాతం కంటే తక్కువే భారత ఐటీ కంపెనీలకు దక్కుతున్నాయని తెలిపింది. అమెరికా వర్క్ ఫోర్స్‌లోని కంప్యూటర్ సైన్స్ దిగ్గజాల్లో సప్లై, డిమాండ్ల మధ్య విపరీతమైన కొరత ఏర్పడుతుందని కూడా నాస్కామ్ పేర్కొంది. ముఖ్యంగా క్లౌడ్, బిగ్ డేటా, మొబైల్ కంప్యూటింగ్లలో ఈ కొరత ఎక్కువగా ఉందని వివరించింది. దేశీయ ఐటీ సర్వీసు కంపెనీల్లో తాత్కాలిక వీసాపై పనిచేసే భారత ఐటీ నిపుణులు మొత్తం 158 మిలియన్ మెంబర్ల అమెరికా వర్క్ ఫోర్స్ లో కేవలం 0.009 శాతమేనని వెల్లడించింది. వీసా హోల్డర్ల కనీసం వేతనం 82వేల డార్లకు పైనే ఉందని, ఇంకా ఫిక్స్డ్ వ్యయాలు 15వేల డాలర్లు ఉంటాయని తెలిపింది. అయితే ఈ మూడు కంపెనీల్లో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఏడాదికి సగటు వేతనం 60,000 నుంచి 65,000 డాలర్ల మధ్య ఉందని అమెరికా పేర్కొంటోంది. కార్మిక శాఖ నిర్దేశించిన వేతనాలకు అనుగుణంగా కేవలం 5–6% హెచ్1బీ వీసా హోల్డర్లే వేతనాలను పొందుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. హెచ్-1బీ వీసాలపై కంపెనీలు తాత్కాలికంగా భారత ఉద్యోగులను అమెరికాలోని తమ కంపెనీల్లో పనిచేయడానికి నియమించుకుంటున్నాయి. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హెచ్-1బీ వీసాలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు అత్యధికమయ్యాయి. ఐటీ కంపెనీలకు భారీగా షాకిస్తూ ట్రంప్ హెచ్-1బీ వీసాల కఠినతరంపై బై అమెరికన్, హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కూడా సంతకం చేశారు. -
నోట్ల రద్దు: కంపెనీలపై భారీగానే ఎఫెక్ట్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం, మూడో క్వార్టర్ లాభాలపై భారీ గండి కొట్టనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రిటైల్ ట్రేడ్‌లో భాగమై ఉన్న కార్పొరేట్లకు ఇది పెద్ద చేదుగానే మిగలనుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) మంగళవారం వెల్లడించింది. రిటైల్ ట్రేడ్‌లో భాగమై ఉన్న కొన్ని కంపెనీలు ఈ నవంబర్‌లో భారీగానే ప్రభావితం కానున్నాయని, దీనిలో ఎలాంటి సందేహం లేదని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. వెంటనే చాలినంత నగదు చలామణిలోకి వస్తే, ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశాలుంటాయని తెలిపారు. ఒకవేళ ప్రస్తుతం నెలకొన్న నగదు లేమి, వచ్చే నెలలో కూడా ఇలానే కొనసాగితే, మూడో త్రైమాసిక ఫలితాలపై భారీగా ఎఫెక్ట్ చూపనున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాపారాలకు తగినంత నగదు అందుబాటులో ఉండేలా కరెంట్ అకౌంట్స్ నుంచి వారానికి విత్‌డ్రా చేసుకునే పరిమితిని రూ.50వేల నుంచి పెంచాలని నౌషాద్ కేంద్రానికి విన్నపించుకున్నారు. లేకపోతే చాలామంది ప్రజలకు ఇది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు వేతనాలు చెల్లించడానికి , వివిధ ఖర్చులను భరించడానికి వారు కరెంట్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకునే పరిమితిని వారానికి రూ.50వేలకు ప్రభుత్వం పెంచింది. కాగ, మూడు నెలల ముందే వారు ఈ ఖాతాను తెరిచి ఉండాలని ప్రభుత్వం తెలిపింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సరియైనదిగా తాము భావిస్తున్నామని, కానీ స్వల్పకాలికంగా ప్రజలు తీవ్ర అసౌకర్యాలు భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
చైనా కంపెనీలే వరస్ట్ ...
హాంగ్ కాంగ్ : పారదర్శకతలో భారత సంస్థలే బెస్ట్ అట..చైనా సంస్థలు వరస్ట్ అని సర్వేలు తేల్చాయి. భారత్ లో అత్యంత పారదర్శకత కలిగిన కంపెనీలు ఉన్నాయని.. అదే చైనా సంస్థలలో పారదర్శకత లోపించిందని గ్లోబల్ యాంటీ-గ్రాప్ట్ వాచ్ డాగ్స్ సర్వే సోమవారం వెల్లడించింది. బ్రెజిల్, మెక్సికో, రష్యా, భారత్ లాంటి 15 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 100 కంపెనీలను ఈ రిపోర్టు కవర్ చేసింది. ఈ రిపోర్టులో పారదర్శకతలో భారత కంపెనీలే టాప్ లో ఉన్నట్టు తేలింది. కఠినతరమైన ప్రభుత్వ నిబంధనలు, వివిధ దేశాల్లో ఆపరేట్ చేసే కంపెనీలకు ఇచ్చే సబ్బిడరీల వల్ల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ 10 మార్కుల స్కోరులో 7.3 దక్కించుకుని టాప్ ప్లేస్ లో నిలిచినట్టు రిపోర్టు నివేదించింది. టాటా సంస్థ ఆరు యూనిట్లు, టెక్నాలజీ కంపెనీ విప్రోలు టాప్ లో చోటు దక్కించుకున్నాయి. అయితే కేవలం ఒకే ఒక్క చైనా సంస్థ జడ్ టీఈ, టాప్ 25లో ఉన్నట్టు వాచ్ డాగ్స్ రిపోర్టు పేర్కొంది. సర్వేలో అతిపెద్ద గ్రూప్ గా తీసుకున్న చైనా 37 కంపెనీల పనితీరు చాలా బలహీనంగా ఉన్నట్టు తేలింది. మూడు కంపెనీలైతే 10 మార్కుల స్కోరులో జీరోను నమోదుచేశాయని తెలిపింది. ఆటోమేకర్ చెర్రీ, అప్లియన్స్ తయారీదారి గాలాంజ్, ఆటో పార్ట్ ల తయారీసంస్థ వాంక్సియాంగ్ గ్రూప్ లు జీరోను నమోదుచేసిన చైనా కంపెనీలుగా నిలిచాయి. పారదర్శకత లోపించి దిగువన నమోదైన 25 కంపెనీలు చైనావే. 2013 కార్పొరేట్ రిపోర్టింగ్ సర్వేతో పోలిస్తే ఈ సర్వేలో మొత్తంగా పారదర్శకత స్కోర్ పడిపోయింది. 10లో 3.4 ఫ్రాక్షన్ కిందకు జారింది. కంపెనీల మూడు త్రైమాసికాలు సగం కంటే ఎక్కువగానే పతనమైనట్టు సర్వే తేల్చింది. రిపోర్టు కనుగొన్న అంశాలు చాలా విషాదకరంగా ఉన్నాయని.. పెద్ద బహుళ జాతీయ కంపెనీలు అవినీతితో మరింత పోరాడాల్సినవసరం ఉందని సర్వే పేర్కొంది. కంపెనీలో అవినీతి వాతావరణం పెరగడం ప్రమాదకరమని బెర్లిన్ కు చెందిన ఈ వాచ్ డాగ్ సర్వే హెచ్చరించింది. -
కొత్త ఏడాదిలో ఐపీఓల జోరు..!
రూ. 8,000 కోట్ల విలువైన పబ్లిక్ ఆఫర్లకు కంపెనీల క్యూ. న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో దేశీ కంపెనీల పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)లు జోరందుకోనున్నాయి. 2015లో కనీసం రూ.8,000 కోట్ల విలువైన ఐపీఓలు వరుసలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ ఇతరత్రా అవసరాల కోసం నిధుల సమీకరణకు ఇదే అదనుగా కంపెనీలు భావిస్తున్నాయి. రానున్న నెలల్లో పబ్లిక్ ఆఫర్ల బాట పట్టనున్న కంపెనీలో వీడియోకాన్ డీ2హెచ్, లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్, వైజాగ్ స్టీల్, ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే సెబీ అనుమతి లభించిన ఏడు కంపెనీలు రూ.2,965 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా చెప్పారు. మరో 12 కంపెనీలు రూ.5,362 కోట్ల సమీకరణ కోసం సెబీ ఆమోదం కోసం వేచిచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు సంస్కరణల జోరు కారణంగా మార్కెట్లు పరుగులు పెడుతుండటం ఐపీఓ మార్కెట్లో ఈ ఏడాది జోష్ నింపనుందని జియోజిత్ బీఎన్పీ పారిబా రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూ అభిప్రాయపడ్డారు. గతేడాది(2014)తో పోలిస్తే ఈ సంవత్సరం ఐపీఓల నిధుల సమీకరణ మొత్తం భారీగా పెరగనుందని చెప్పారు. 2014లో పబ్లిక్ ఆఫర్ల ద్వారా కంపెనీలు సమకరించిన మొ త్తం కేవలం రూ.1,528 కోట్లే(2012లో రూ.1,619 కోట్లు) కావడం గమనార్హం. ఈ జనవరి-మార్చి మధ్య ఐపీఓలు అధికంగా రావచ్చని హాల్దియా పేర్కొన్నారు. కాగా, ఎలక్ట్రానిక్ ఐపీఓ(ఈ-ఐపీఓ)లకు సంబంధించి త్వరలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలను జారీ చేయవచ్చని.. ఇది మార్కెట్‌కు మరింత ఊతమిస్తుందనేది నిపుణుల అభిప్రాయం. -
ఫోర్బ్స్ నవకల్పన జాబితాలో 9 దేశీ కంపెనీలు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన వంద నవకల్పన వృద్ధి కంపెనీల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సాఫ్ట్వేర్ అకౌంటింగ్ సంస్థ గ్జెరో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ భవిష్యత్తులో అందించే కొత్త ఉత్పత్తులు, సేవలు, మార్కెట్లపై ఇన్వెస్టర్ల అంచనాలు, ఆ అంచనాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఈ జాబితాలో గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ 425 కోట్ల డాలర్లతో 31వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత కంపెనీల వివరాలిలా ఉన్నాయి. ఏబీబీ ఇండియా(37వ స్థానం), మ్యారికో(53), యునెటైడ్ బ్రూవరీస్(60), సీమెన్స్ ఇండియా(63), ఏషియన్ పెయింట్స్(78), నెస్లే ఇండియా(78), కోల్గేట్ పామోలివ్ ఇండియా(87), దివీస్ ల్యాబ్స్(99).