ABB India
-
ఏబీబీ ఇండియా, ఐఆర్‌ఎప్‌సీ ఫలితాలు
ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. జులై–సెప్టెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ.440 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ.362 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ.2,846 కోట్ల నుంచి రూ.3,005 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 11 శాతం అధికంగా రూ.3,342 కోట్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. దీంతో మొత్తం ఆర్డర్ల విలువ రూ.9,995 కోట్లకు చేరింది. ఇది 25 శాతం వృద్ధి.ఇదీ చదవండి: ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..ఐఆర్ఎఫ్సీ లాభం ప్లస్ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీ..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ.1,613 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.1,545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,762 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ.5,218 కోట్ల నుంచి రూ.5,288 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. మినీరత్న కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 సెప్టెంబర్‌కల్లా రూ.4,62,283 కోట్లకు చేరాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 0.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త!
మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ ఏబీబీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఛార్జర్‌ని "టెర్రా 360" పేరుతో విడుదల చేసింది. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికలతో వచ్చినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా విడుదల చేసిన టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాలను ఛార్జ్ చేయగలదు. 15 నిమిషాల్లో 500 కి.మీ వెళ్లగల ఒక ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 100 కి.మీల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 360 kW అవుట్‌పుట్ కలిగి ఉంది. ఈ ఏడాది చివరినాటికి యూరప్, యునైటెడ్ స్టేట్స్లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది. లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో 2022లో తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఏబీబీ ఛార్జర్లకు డిమాండ్ పెరుగుతోంది. 2010లో ఈ-మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుంచి 88కి పైగా మార్కెట్లలో 4,60,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను విక్రయించింది. ఎలక్ట్రో ఛార్జింగ్ వ్యాపారంలో తన హవాను కొనసాగించాలని కోరుకుంటుంది. 2020లో 220 మిలియన్ డాలర్ల విక్రయాలు కలిగిన ఏబీబీ వాహన ఛార్జింగ్ వ్యాపారం ఒక ఫ్లోట్లో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువను సాధించగలదని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!) -
హిటాచీ చేతికి ఏబీబీ ‘పవర్’
న్యూఢిల్లీ: స్విస్ ఇంజనీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు) ఉండనున్నట్లు తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు 2020 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కావొచ్చని అంచనా. డీల్ ప్రాథమిక స్వరూపం ప్రకారం... ఈ జాయింట్ వెంచర్లో ఏబీబీ 19.9 శాతం వాటాలను అట్టే పెట్టుకోనుంది. ఒప్పందం ముగిసిన మూడేళ్ల తర్వాత సముచిత మార్కెట్ రేటుకు విక్రయించేసి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పవర్ గ్రిడ్ పరిశ్రమలో స్థానం పటిష్టం చేసుకునేందుకు హిటాచీకి ఈ డీల్ లాభించనుంది. ప్రధానంగా పారిశ్రామిక రోబోల తయారీలో ఉన్న ఏబీబీ... ఆటోమేషన్ వంటి విభాగాలపై దృష్టి పెట్టే క్రమంలో అంతగా లాభదాయకత లేని వ్యాపార విభాగాన్ని వదిలించుకునేందుకు తాజా డీల్ తోడ్పడనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలపై 500 మిలియన్ డాలర్లు వెచ్చించనుండగా, ఏటా 500 మిలియన్ డాలర్ల మేర వ్యయాలు తగ్గుతాయని ఏబీబీ వివరించింది. జాయింట్ వెంచర్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంటుందని, ప్రస్తుత మేనేజ్మెంట్ టీమ్‌నే హిటాచీ కొనసాగిస్తుందని పేర్కొంది. మరోవైపు, పవర్ గ్రిడ్ బిజినెస్‌ను ఏబీబీ ప్రత్యేక వ్యాపార సంస్థగా విడగొడుతోందని, దీని విలువ నుంచి రుణభారం మొదలైనవన్నీ తీసేయగా.. 80.1% వాటాలను సుమారు 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నామని హిటాచీ తెలిపింది. 10 బిలియన్ డాలర్ల టర్నోవర్.. ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్ విభాగానికి .. వివిధ దేశాల్లో విద్యుత్ సరఫరా పరికరాలు, కంట్రోల్ వ్యవస్థల ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి. ఇందులో 36,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. గతేడాది 10.4 బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ స్వల్పంగా 60 బేసిస్ పాయింట్లు క్షీణించి 10.0 శాతానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితమే పవర్ గ్రిడ్స్ విభాగాన్ని విక్రయించేయాలంటూ కొందరు షేర్‌హోల్డర్ల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ.. ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పైస్హోఫర్ అంగీకరించలేదు. కానీ తాజాగా యూ–టర్న్ తీసుకుని విక్రయ ప్రతిపాదనకు అంగీకరించారు. ఏబీబీ సంస్థ భారత్‌లో ఏబీబీ ఇండియా పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ఎన్ఎస్ఈలో సంస్థ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,400 వద్ద క్లోజయ్యింది. -
8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్‌పీ ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్’ను ఏబీబీ భారత మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్‌తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పీసోఫర్ ప్రశంసించారు. మూవ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఎలక్ట్రిక్ రవాణాకు ఏబీబీ తన టెక్నాలజీలతో సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన హానోవర్ ఇండస్ట్రీ ఫెయిర్‌లో నూతన టెర్రా హైపవర్ ఈవీ చార్జర్‌ను ఏబీబీ ఆవిష్కరించింది. ఇది ఎనిమిది నిమిషాల చార్జింగ్‌తో ఓ కారును 200 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేయగలదు. ఈ తరహా ఫాస్ట్ చార్జర్‌ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని’’ స్పీసోఫర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల రవాణాకు సంబంధించిన టెక్నాలజీలో లీడర్‌గా ఉన్నామని, టోసా సిస్టమ్ కేవలం 20 సెకండ్ల బరస్ట్‌తో ఓ బస్సు రోజంతా నడిచేలా చేయగలదన్నారు. -
స్టాక్స్ వ్యూ
సియట్ బ్రోకరేజ్ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,390 టార్గెట్ ధర: రూ.1,899 ఎందుకంటే: ఆర్పీ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో అతి పెద్ద టైర్ల కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ అన్ని రకాల టైర్లను–ట్రక్, బస్సు, టూ, త్రీ వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, తేలిక రకం వాణిజ్య వాహనాలు, వ్యవసాయ, స్పెషాల్టీ టైర్లను తయారు చేస్తోంది. అమ్మకాల్లో రీప్లేస్మెంట్ మార్కెట్ వాటా 61%, ఎగుమతులు 12 %గా ఉన్నాయి. 4,500 మంది డీలర్లతో పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 15% వృద్ధితో రూ.1,670 కోట్లకు పెరిగింది. టైర్ల అమ్మకాలు 18% పెరిగాయి. టూ వీలర్ల సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ల టైర్ల ధరలను పెంచడం కంపెనీకి కలసివచ్చింది. స్థూల మార్జిన్ 5% ఎగసి 38.6%కి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, స్వల్పంగా (25 బేసిస్ పాయింట్లు) తగ్గింది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ముడి పదార్థాల ధరలు 2 శాతం పెరిగినప్పటికీ, ఇబిటా 223 శాతం పెరిగి రూ.170 కోట్లకు చేరింది. నికర లాభం 307 శాతం వృద్ధితో రూ.78 కోట్లకు చేరింది. వచ్చే క్వార్టర్లో ముడి పదార్థాల ధరలు మరో 2–3 శాతం మేర పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.870 కోట్లుగా ఉన్న రుణభారం(కన్సాలిడేటెడ్) ఈ ఏడాది జూన్ నాటికి రూ.750 కోట్లకు తగ్గింది. ముడి పదార్థాల ధరలు పెరుగుతుండటంతో టైర్ల ధరలను ఈ కంపెనీ 1–2 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ముడి చమురు, రబ్బరు ధరలు మరింతగా పెరిగితే మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏబీబీ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ అమ్మొచ్చు ప్రస్తుత ధర: రూ.1,184 టార్గెట్ ధర: రూ. 990 ఎందుకంటే: విద్యుత్ ప్రసార, పంపిణీ, ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇబిటా మార్జిన్ 7.8% ఉండొచ్చని అంచనా వేయగా 7.2% మాత్రమే సాధించగలిగింది. ఇబిటా 33% వృద్ధితో రూ.196 కోట్లకు చేరింది. అయితే రూ.210 కోట్ల ఇబిటా సాధిస్తుందని అంచనాలున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల ఇబిటా అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ. 100 కోట్లకు చేరింది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,710 కోట్లకు పెరిగింది. కంపెనీ ఫలితాల్లో ఇదొక్కటే అంచనాలను అందుకోగలిగింది. స్థూల మార్జిన్ 2.7% తగ్గి 33.5%కి చేరింది. ఈ కంపెనీ నికర దిగుమతిదారు కాబట్టి రూపాయి పతనం ప్రతికూల ప్రభావం(ఈ క్యూ2లో రూ.10 కోట్ల ఫారెక్స్ నష్టాలు వచ్చాయి) చూపించడం, ముడి పదార్థాల ధరలు పెరగడం.. ఈ మూడు కారణాల వల్ల స్థూల మార్జిన్ తగ్గింది. సోలార్, రైల్, డిజిటలైజేషన్ వంటి కొత్త రంగాలపై దృష్టి కారణంగా ఆర్డర్లు 7% పెరిగి రూ.2,500 కోట్లకు చేరాయి. అయితే ఈ కంపెనీ ఈ క్యూ2లో భారీ ఆర్డర్లను ఏమీ సంపాదించలేకపోయింది. మార్జిన్లు తక్కువగా ఉండే ప్రాజెక్ట్ వ్యాపారం అమ్మకాలు అధికంగా ఉండటం, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం కారణంగా కంపెనీ ఆదాయ అంచనాలను ప్రస్తుత ఏడాదికి 8%, వచ్చే సంవత్సరానికి 2% చొప్పున తగ్గించాం. విద్యుత్ ప్రసార, పంపిణీ రంగాలకు అవసరమయ్యే ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సర్వీస్ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సాకారం కావడానికి దీర్ఘకాలం పడుతుంది. ఈ షేర్ విలువ అధికంగా ఉందనే ఉద్దేశంతో అమ్మేయండి అనే రేటింగ్‌ను ఇస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
ఫోర్బ్స్ నవకల్పన జాబితాలో 9 దేశీ కంపెనీలు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన వంద నవకల్పన వృద్ధి కంపెనీల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సాఫ్ట్వేర్ అకౌంటింగ్ సంస్థ గ్జెరో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ భవిష్యత్తులో అందించే కొత్త ఉత్పత్తులు, సేవలు, మార్కెట్లపై ఇన్వెస్టర్ల అంచనాలు, ఆ అంచనాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఈ జాబితాలో గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ 425 కోట్ల డాలర్లతో 31వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత కంపెనీల వివరాలిలా ఉన్నాయి. ఏబీబీ ఇండియా(37వ స్థానం), మ్యారికో(53), యునెటైడ్ బ్రూవరీస్(60), సీమెన్స్ ఇండియా(63), ఏషియన్ పెయింట్స్(78), నెస్లే ఇండియా(78), కోల్గేట్ పామోలివ్ ఇండియా(87), దివీస్ ల్యాబ్స్(99).