liquor companies
-
ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: మద్యం కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరుకు సంబంధించి సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసులో తనకు ముందస్తుగా బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఇస్తే, మరో కేసులో అరెస్టు చేయాలన్న కుట్రతోనే తాజాగా మద్యం కుంభకోణం కేసు నమోదు చేసిందన్నారు. దీర్ఘకాలం పాటు జైలులోనే ఉంచాలన్న వ్యూహంలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. స్కిల్ కుంభకోణంలోనూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా అరెస్టుచేశారని వివరించారు. ఈ కేసులో కూడా అలా అరెస్టుచేస్తారన్న ఆందోళనతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఆయన చెప్పారు. 28వరకు అరెస్టు చేయబోం.. అనంతరం.. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. స్కిల్ స్కాం కేసులో కంటి శస్త్రచికిత్స నిమిత్తం చంద్రబాబుకు నవంబరు 28 వరకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిందని, అందువల్ల అప్పటివరకు తాము ఆయనను అరెస్టుచేయబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను రికార్డ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అడ్డగోలుగా అనుమతులతో.. నిజానికి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరుచేశారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కుంభకోణంపై ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును మూడో నిందితునిగా చేర్చింది. -
రష్యన్లకు ఇండియన్ కిక్కు.. అక్కడ మన ‘ఆఫీసర్స్ ఛాయిస్’!
ఇండియన్ మద్యం కంపెనీ రష్యన్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన విస్కీల్లో మూడోదైన ఆఫీసర్ ఛాయిస్‌ను తయారు చేసే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ (ఏబీడీ) రష్యన్ మార్కెట్లోకి ప్రవేశించబోతోందని వ్యాపార దినపత్రిక కొమ్మర్సంట్ పేర్కొంది. రష్యన్ వోడ్కా తయారీ కంపెనీ ఆల్కహాల్ సైబీరియన్ గ్రూప్ (ఏఎస్జీ) తమ రెండు ఏబీడీ బ్రాండ్లకు పంపిణీదారుగా మాత్రమే ఉంటుందని అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ప్రకటించింది. ఏబీడీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు మద్యం ఎగుమతి చేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం 765 మిలియన్ డాలర్లు దాటింది. కొమ్మర్సంట్ కథనం ప్రకారం... ప్రస్తుతం రష్యాలో కొన్ని వెస్ట్రన్ బ్రాండ్లు నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న మార్కెట్ వాటాను అందుకోవాలని ఏబీడీ కంపెనీ చూస్తోంది. రష్యాలో ఏబీడీ ఉత్పత్తుల డెలివరీలు ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ అమ్మకాల పరిమాణం ఏ మేరకు ఉందన్నది ఇంకా తెలియదు. కంపెనీ ఒప్పందం అక్టోబర్ 2025 వరకు ఉంటుందని తెలిసింది. రష్యాలో ఆఫీసర్స్ ఛాయిస్ బ్లూ విస్కీ 750 ఎంల్ బాటిల్ ధర 1,000 నుంచి 1,200 రూబిల్స్ (రూ.1100 నుంచి రూ.1300) ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్టెర్లింగ్ రిజర్వ్ ధర 1,100 నుంచి 1,500 రూబిల్స్ ( రూ.1200 నుంచి రూ.1600) ఉంటుంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి -
అవన్నీ బీ బ్రాండ్లు.. సీ బ్రాండ్లే: ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రసుగా మారిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా మద్యంపై చంద్రబాబు, టీడీపీ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సోమిరెడ్డి, బోండా ఉమా, అనిత నోటి నుంచి వస్తున్న మద్యం బ్రాండ్లన్నీ బీ–బ్రాండ్లు, సీ–బ్రాండ్లేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన చంద్రబాబుకు ‘శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి’, ‘మద్య మహా సామ్రాట్’ అనే బిరుదులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ మెడల్స్ అన్నీ చంద్రబాబు మెడలోనే వేయాలన్నారు. గోబెల్స్ కంటే ఘోరంగా అబద్ధాలను ప్రచారం చేయగల దిట్ట చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. అధికారం, దోచుకోవడం, తనవాళ్లకు అంతులేకుండా దోచిపెట్టడం తప్పితే.. ప్రజలకు సాయం చేయాలనే భావన ఆయనకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. పార్థసారథి ఇంకా ఏమన్నారంటే.. ఈ డిస్టిలరీలు ఎవరివి? ► విశాఖ డిస్టిలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా? పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణా డిస్టిలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా? ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా? వీరంతా టీడీపీ వారు కాదా? వీటన్నింటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు కాదా? ► రాష్ట్రంలో చీప్ లిక్కర్ వల్ల ఎటువంటి మరణాలూ సంభవించలేదు. అవన్నీ టీడీపీ, ఎల్లో మీడియా వండి వార్చిన మరణాలు మాత్రమే. పొగ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. మద్యం సేవించడం కూడా అంతే హానికరం అన్నది గుర్తెరగాలి. ► ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్.. ఇలా గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకూ చంద్రబాబు ఎవరినైనా వాడేస్తారు. ఈ పేర్లతో ఉన్నవన్నీ బాబు బ్రాండ్లు కాబట్టి బీ బ్రాండ్లు అనో, లేదా చంద్రబాబు బ్రాండ్లు కాబట్టి, సీ బ్రాండు అనో అనాలి. ఇంతకాలం జె బ్రాండ్లని తప్పుడు ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ► 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి, ఒక బ్రూవరీకి సీఎం జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. బాబు హయాంలోనే అనుమతులు ► ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరి 6న అనుమతి లభించింది. గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్‌కు 2018 నవంబరు 5న, హైదరాబాద్ విస్కీ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు. ► గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, సెవెన్త్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు.. వీటన్నింటికీ ఏపీ స్టేట్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018 అక్టోబరు 26న అనుమతి ఇచ్చింది. ఈ బాటిల్స్‌ను బాబు మెడలో, సోమిరెడ్డి మెడలో, అనిత మెడలో వేయాలి. అయ్యన్నపాత్రుడి మెడలో మాత్రం వేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన గంజాయి మాత్రమే తాగుతారు. ► విరా, బ్లాండే లాంటి బ్రాండ్లతో పాటు బూమ్ బీరు తీసుకు వచ్చింది చంద్రబాబే. 2019 మే 14న బూమ్ బీరుకు అనుమతి ఇచ్చారు. ► హై ఓల్టేజి గోల్డ్ బీరు, ఎస్ ఎన్ జే బీరు, బ్రిటీష్ ఎంపయర్ బీరు.. ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందీ 2017 జూన్ 7న. రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, లూహీ 14 బ్రాండ్లు, సైనవుట్ బ్రాండ్లు రంగ ప్రవేశం చేసింది 2018 నవంబరు 9న. వీటన్నింటిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారు? -
లిక్కర్ షేర్లకు కొనుగోళ్ల కిక్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు పుంజుకోగా.. పలు రంగాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, తదితర ఆతిథ్య రంగాలు సైతం తిరిగి గాడిన పడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లిక్కర్ తయారీ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. వెరసి పలు కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యునైటెడ్ బ్రూవరీస్ 6.2 శాతం జంప్‌చేసి రూ. 1,152 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల్లో ఈ షేరు 14 శాతం ర్యాలీ చేయగా గ్లోబస్ స్పిరిట్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 197 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సోమ్ డిస్టిల్లరీస్ 3.5 శాతం ఎగసి రూ. 58కు చేరింది. ఈ బాటలో యునైటెడ్ స్పిరిట్స్ 2 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 588 వరకూ పెరిగింది. ఇక జీఎం బ్రూవరీస్ 2 శాతం లాభపడి రూ. 404ను తాకగా.. ఇంట్రాడేలో రూ. 412ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో పయనీర్ డిస్టిల్లరీస్ 2 శాతం పుంజుకుని రూ. 113 వద్ద, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ 2 శాతం లాభంతో రూ. 268 వద్ద, రాడికో ఖైతాన్ 1.5 శాతం బలపడి రూ. 408 వద్ద ట్రేడవుతున్నాయి. -
గ్లోబస్ స్పిరిట్స్- నోసిల్.. లాభాల కిక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్వర్ కంపెనీ గ్లోబస్ స్పిరిట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించినప్పటికీ రబ్బర్ కెమికల్స్ కంపెనీ నోసిల్ లిమిటెడ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. గ్లోబస్ స్పిరిట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్లోబస్ స్పిరిట్స్ నికర లాభం 161 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం రెట్టింపై రూ. 25 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 292 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గ్లోబస్ స్పిరిట్స్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 170 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో ఈ షేరు 90 శాతంపైగా ర్యాలీ చేయడం విశేషం! నోసిల్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో నోసిల్ లిమిటెడ్ నికర లాభం 64 శాతం నీరసించి రూ. 12 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 54 శాతం క్షీణించి రూ. 107 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 81 శాతం పడిపోయి రూ. 9.3 కోట్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు కారణంగా టైర్ల కంపెనీల నుంచి ప్రొడక్టులకు డిమాండ్ పడిపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇకపై రబ్బర్ కెమికల్స్‌కు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేసింది. చైనా స్థానే కంపెనీకి మరిన్ని ఆర్డర్లు లభించగలవని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నోసిల్ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 132.5 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! -
లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు
చెన్నై : తమిళనాడుకు చెందిన రెండు మద్యం కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 700 కోట్లను అధికారులు గుర్తించారు. అలాగే ఆ రెండు సంస్థల కార్యకలాపాలను స్తంభింపచేశారు. తొలుత బీర్, ఐఎంఎఫ్ఎల్ తయారు చేస్తున్న ఓ ప్రముఖ సంస్థ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల నుంచి ఐటీ అధికారులకు సమచారం అందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 6వ తేదీ ఉదయం సోదాలు ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలతోపాటు, ప్రమోటర్లు, కీలక వ్యక్తుల ఇళ్లపై అధికారులు దాడులు చేశారు. తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో మొత్తం 55 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గత ఆరేళ్లుగా పన్ను చెల్లించని రూ. 400 కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఈ సోదాలు చేపడుతున్న క్రమంలో.. ఇదే రంగానికి చెందిన మరో సంస్థ కూడా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతో ఈ నెల 9 తేదీన సదురు సంస్థ కార్యాలయాలతోపాటు కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేపట్టారు. మొత్తంగా చెన్నై, కరైకల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ దాదాపు ఆ సంస్థ రూ. 300 కోట్ల ఆదాయానికి పన్ను చెల్లించలేదని గుర్తించారు. అయితే ఆ సంస్థల పేరు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు. -
మద్యం కంపెనీలకు ఝలక్
లైసెన్సులు పొడగింపునకు సీఎం నితీశ్ నో పట్నా: రాబోయే ఆర్థిక సంవత్సరం (2017-2018) నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ఉత్పత్తి కంపెనీలకు లైసెన్సులను పొడగించబోమని, కొత్త లైసెన్సులను ఇవ్వబోమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధం క్షేత్ర స్థాయిలో ఏవిధంగా అమలవుతుందో తెలుసుకోవడానికి గత డిసెంబర్లో సీఎం నితీశ్ ‘నిషాయ్ యాత్ర ’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారం చేతన్ సభ అనే ప్రాంతంలో ఈ యాత్ర నిర్వహించిన నితీష్ మాట్లాడుతూ ‘‘ఎక్సైజ్ యాక్ట్–2016’’ ప్రకారం 2017 ఏప్రిల్1నుంచి రాష్ట్రమంతటా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు. మద్యం కంపెనీలకూ, బీర్ల కంపెనీలకూ ఇక నుంచి లైసెన్సులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇథనాల్ యూనిట్లను మాత్రం కొనసాగిస్తామని,దాని పర్యావరణానికి మేలు జరిగేలా పెట్రోల్‌లో మిశ్రమంలా కలుపుతామన్నారు.