Battiprolu
-
ప్రేమించి మోసం చేశాడు పోలీసు స్టేషన్ వద్ద గర్భవతి ఆందోళన
-
పోలీసు స్టేషన్ ముందు గర్భవతి ఆందోళన
సాక్షి, గుంటూరు: ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని.. ఓ యువతిని మోసం చేశాడు నాగార్జునరెడ్డి అనే యువకుడు. హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న యువతికి గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన నాగార్జున రెడ్డి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ప్రమాణాం చేసి.. ఆ యువతిని గర్భవతిని చేశాడు. ఈ విషయం నాగర్జున రెడ్డికి చెప్పగానే.. మా ఇంట్లో వాళ్లను ఒప్పిస్తానని వెళ్లిన అతను ఇప్పటివరకు తిరిగి రాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటికి వెళ్లిన నాగార్జున పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని.. మీరే ఓ ముహుర్తం పెట్టండని తమకు ఫోన్ చేశాడని తమకు ఫోన్ చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. తీరా ముహుర్తం పెట్టాక ఫోన్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోయాడని చెప్పారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా తమను తిప్పుకోవడమే తప్ప.. న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా తిప్పించుకోవడమే తప్ప కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు 8 నెలల గర్భవతి. మరికొన్ని రోజుల్లో జన్మించే చిన్నారికి తన తండ్రి ఎవరో చూపించడం ఎలా అని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాగార్జున రెడ్డిని తీసుకొచ్చి తనతో వెంటనే పెళ్లి చేయాలని కోరుతోంది. పోలీసు స్టేషన్ వద్ద గర్భవతి ఆందోళన -
గర్భిణుల్లో అపోహలను తొలగించాలి
సాక్షి, భట్టిప్రోలు: గర్భిణుల్లో నెలకొన్న అపోహలను వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తొలగించాలని భట్టిప్రోలు పీహెచ్సీ డాక్టర్ ఎ.సీతాకుమారి సూచించారు. పీహెచ్సీలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాకుమారి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి గర్భిణుల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చూడాలని కోరారు. బాలింతలు ఈ సేవలు పొందేందుకు 102 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలి వెల్లటూరు పీహెచ్సీలో నిర్వహించిన ఆశాడే సమావేశంలో డాక్టర్ సీహెచ్ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్విహించనున్న సామూహిక పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. -
కారులో కోటి రూపాయలు లభ్యం
గుంటూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో రోజువారి తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరులో చేపట్టిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు గురించి పోలీసులు ప్రశ్నించగా ఖచ్చితమైన సమాధానం లభించకపోవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.