రికార్డులు పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు
75 బస్తాల యూరియా సీజ్
Published Mon, Aug 1 2016 11:37 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
► లక్ష్మీఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణంపై కేసు నమోదు
► అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు
చల్లవానిపేట(జలుమూరు): ఎరువులు అధిక ధరలకు అమ్మితే వారిపై కేసులు నమోదుచేసి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వ్యవసాయాశాఖ సహాయ సంచాలకులు ఎస్‌జేవీ రామ్మోహనరావు అన్నారు. చల్లవానిపేటలో లక్ష్మీఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అక్రమంగా నిల్వ ఉన్న 75 బస్తాల యూరియాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఎరువులు అమ్మకాలకు తగిన లైసెన్స్‌లు, అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు. అమ్మే ఎరువులు అనుమతి ఉన్న డీలర్లు వద్ద నుంచి తెస్తున్నారా లేదా సరిచూశారు. పురుగు మందులను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు ఎరువుల వ్యాపారులు వ్యాపారం లేదని రికార్డులు చూపడంలేదని, అలాంటి వాటిని పరిశీలించి సంబంధిత లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఇలా జిల్లాలో రెండు బృందాలతో ముమ్మర తనిఖీలు చేసి, తుది నివేదిక ఉన్నతాధికారులకు పంపనున్నామన్నారు. ఆయనతో పాటు పెనుగొండ ఏవో వై.రాఘవేంద్రరావు, ఏవో విజయభాస్కరరావు, ఎంపీఈవో పి.రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Advertisement